డూడ్‌తో లవ్ లాక్

డూడ్‌తో లవ్ లాక్


 అది పారిస్‌లోని ‘లవ్ లాక్ బ్రిడ్’జ. తమకు నచ్చిన వాళ్లు తమతో పాటు శాశ్వతంగా నిలిచిపోవాలని అక్కడకు వెళ్లిన ప్రేమికులు బ్రిడ్జ్ దగ్గరున్న తాళం కప్ప మీద తమ పార్ట్‌నర్స్ పేరు రాసి తాళం వేసేస్తారు. అలా తమ ప్రేమ ఆ తాళంలో శాశ్వతంగా నిక్షిప్తమై ఉంటుందని విశ్వసిస్తారట! ‘అయ్ దిల్ హై ముష్కిల్’ సినిమా షూటింగ్ కోసం అనుష్కా శర్మ ప్యారిస్‌కు వెళ్లారు. ప్రస్తుతం ‘సిటీ ఆఫ్ రొమాన్స్’ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

 

  షూటింగ్ విరామ సమయంలో పారిస్‌లో ఫేమస్ అయిన లవ్ లాక్ బ్రిడ్జ్ గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లారు అనుష్క. అసలే విరాట్ కొహ్లీతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన అనుష్కా శర్మ కూడా ఓ తాళంకప్ప తీసుకొని ఓ పేరు రాసి ఆ తాళాన్ని నీళ్లలోకి వేసేశారు. అసలు ఎవరి పేరు రాశారనేది మీ ప్రశ్న కదా? విరాట్ కొహ్లీ అని రాశారని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే! తనకెంతో ఇష్టమైన పెంపుడు కుక్క డూడ్ పేరును లవ్ సింబల్‌తో సహా రాసి ఆ తాళాన్ని విసిరేశారట!

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top