Alexa
YSR
‘ప్రతి పల్లెలోనూ అందరికీ గ్యాస్‌ సరఫరా, ప్రతి మహిళకూ ఆర్థిక భరోసా నా ధ్యేయం’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం సినిమాకథ

రాజకీయాల్లోకి అంజలి?

Sakshi | Updated: August 14, 2017 01:52 (IST)
రాజకీయాల్లోకి అంజలి?

తమిళసినిమా: రాజకీయాలకు, చిత్ర పరిశ్రమకు విడదీయరాని అనుబంధం ఉందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా కోలీవుడ్, టాలీవుడ్‌ ప్రముఖులు రాజకీయాల్లో రాణిస్తున్నారు. తాజాగా తమిళ రాజకీయాలు సూపర్‌స్టార్‌ రజనీకాంత్, విశ్వనటుడు కమలహాసన్‌ల చుట్టూ తిరుగుతున్నాయి. వీరి రాజకీయరంగప్రవేశం త్వరలోనే ఉంటుందని వారి అభిమానులు ఆశిస్తున్నారు. ఇక మన సీనియర్‌ కథానాయికల రాజకీయం తక్కువేం కాదు.

ఇప్పటికే రోజా, నగ్మా, కుష్బు వంటి నటీమణులు రాజకీయాల్లో తలమునకలై ఉన్నారు. వారి వరుసలో కొత్తగా అంజలి చేరే అవకాశాలు కనిపిస్తున్నట్లు సోషల్‌ మీడియాల్లో ప్రచారం హల్‌చల్‌ చేస్తోంది. సంచలన నటిగా పేరొందిన అంజిలి కోలీవుడ్, టాలీవుడ్‌లోనూ తనకంటూ ఒక స్థాయిని అందుకున్నారు. పినతల్లితో విభేదం, నటుడు జైతో ప్రేమాయణంలోనూ కలకలం సృష్టించిన అంజలి ఈ మధ్య అనూహ్యంగా దేశ రాజధానిలో పార్లమెంట్‌ను విజిట్‌ చేసొచ్చారు.

దీంతో అంజలి రాజకీయంపై మీడియా దృష్టి పెట్టింది.అందుకు తగ్గట్టు గానే ఈ అచ్చ తెలుగు అందాల ఆడపడుచు ఇటీవల ఒక భేటీలో తనకు రాజకీయాలంటే చాలా ఇష్టం అని, నిత్యం వాటిని గమనిస్తుంటానని పేర్కొన్నారు. మీడియాకు ఆ హింటు చాలు కదా! అంజలి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయనున్నారని,  అక్కడ ప్రముఖ రాజకీయ పార్టీ వైఎస్‌ఆర్‌ పార్టీలో చేరబోతున్నారని  ప్రచారం వైరల్‌ అవుతోంది. కాగా ఈ భామ నటించిన బెలూన్‌ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

పట్టాలు తప్పిన ఉత్కళ్‌

Sakshi Post

Sri Lanka Squander Solid Start To Collapse To 216

The home team’s ordinary batting show came after Virat Kohli won a fourth-consecutive toss on this t ...

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC