అంజలి... ‘గీతాంజలి’

అంజలి... ‘గీతాంజలి’ - Sakshi


అంజలి నటిస్తోన్న హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం ‘గీతాంజలి’ సినిమా లోగోను పవన్‌కల్యాణ్ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ కోన వెంకట్‌కు, ఇతర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారాయన. ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి. సత్యనారాయణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. రాజకిరణ్ దర్శకునిగా పరిచయమవుతున్నారు.

 

 కోన వెంకట్ మాట్లాడుతూ -‘‘హారర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. అనుష్కకు అరుంధతిలా, అంజలికి గీతాంజలి ఓ మైలురాయిలా నిలిచిపోతుంది’’ అని చెప్పారు. నిర్మాత ఎం.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ -‘‘ఇప్పటికి యాభై శాతం చిత్రీకరణ పూర్తయింది. జూన్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. అంజలి, బ్రహ్మానందం, రావు రమేష్, శ్రీనివాసరెడ్డి, హర్షవర్థన్ రాణే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్, కెమేరా: సాయి శ్రీరామ్, సహ నిర్మాత: వీఎస్‌ఎన్ కుమార్.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top