ఫ్రాన్స్ లో ఏజెంలీనా జోలీ, బ్రాడ్ పిట్ల వివాహం
హాలీవుడ్ తారలు ఏజెంలీనా జోలీ, బ్రాడ్ పిట్లు శనివారం ఒక్కటవుతున్నారు. జోలీ, బ్రాడ్ పిట్ల వివాహం ఫ్రాన్స్‌లోని చాటీ మిరావల్‌లో జరుగుతుందని వారి ఆధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రైవేట్ కార్యక్రమంగా జరిగే ఈ వివాహానికి సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరువుతున్నారని ఓ ప్రకటనలో తెలిపారు.
కాలిఫోర్నియా న్యాయమూర్తి నుండి వివాహపత్రాన్ని తీసుకున్నారని, వీరి పెళ్లిని ఫ్రాన్స్‌లో న్యాయమూర్తి జరిపిస్తారని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వివాహానికి జోలీ కుమారులు మాడోక్స్, పాక్స్లు కూడా హాజరవుతున్నారు.
సంబంధిత వార్తలు