అలియా స్టూడెంట్గా జాయిన్ అవుతా: అమితాబ్

అలియా స్టూడెంట్గా జాయిన్ అవుతా: అమితాబ్ - Sakshi


ట్విట్టర్ వేదికగా బాలీవుడ్ సెలబ్రిటీలు నవ్వుల పూయిస్తున్నారు. అభిమానులతో ఇంటరాక్షన్ కోసం సోషల్ వెబ్సైట్లలో యాక్టివ్గా ఉంటున్న టాప్ స్టార్స్, అప్పుడప్పుడు ఇంట్రస్టింగ్ కామెంట్స్తో వార్తల్లో నిలుస్తున్నారు.  హీరోయిన్ అలియా భట్ పోస్ట్కు బిగ్బీ అమితాబ్ చేసిన ఓ కామెంట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది.



'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అలియా భట్ అవకాశం వస్తే తనకు డ్యాన్సర్గా లేదా యాక్టింగ్ టీచర్గా మారాలని ఉందని పోస్ట్ చేసింది.. అయితే ఈ పోస్ట్ పై బిగ్ బి.. నేను నీ హంబుల్ స్టూడెంట్ అంటూ రిప్లై ఇచ్చారు. వెంటనే స్పందించిన అలియా యాక్టింగ్ ఇనిస్టిట్యూషనే... స్టూడెంట్గా మారుతానంటున్నారా అంటూ అమితాబ్ పట్ల తన గౌరవాన్ని తెలియజేసింది.



ప్రస్తుతం అలియా.. షాహిద్ కపూర్తో కలిసి 'షాందార్' సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ విషయంలో కూడా ఆమె చాలా యాక్టివ్ పాల్గొంటుంది. ప్రజెంట్ ఈ ట్విటర్ కామెంట్స్ కూడా మూవీ ప్రమోషన్కు ప్లస్ అవుతాయని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top