అతి పే...ద్ద సినిమా : నిడివి 720 గంటలు

అతి పే...ద్ద సినిమా : నిడివి 720 గంటలు


మన సినిమాలు రెండు నుంచి రెండున్నర గంటల నిడివితో ఉంటాయి. అదే హాలీవుడ్ సినిమాలయితే గంటన్నర లోపే. కానీ ఒకే సినిమా కొన్ని రోజుల పాటు కొనసాగితే ఎలా ఉంటుంది. అలాంటి సినిమా ఉంటుందన్న ఆలోచన కూడా మనకు రాదు. కానీ త్వరలో ఓ పే...ద్ద సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఏకంగా 30 రోజులపాటు ఏకధాటిగా చూడాల్సిన సినిమా వెండితెరపై రానుంది. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజంగా నిజం.



స్వీడిష్ డైరెక్టర్ అండర్స్ వెబర్గ్ ఈ భారీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 20 ఏళ్ల పాటు విజువల్ ఆర్ట్స్ రంగంలో అనుభవం ఉన్న అండర్స్, 2020లో రీటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇన్నేళ్ల కెరీర్ లో అందరూ మాట్లాడుకునేలా ఏది చేయలేకపోయానని భావిస్తున్న అండర్స్, సుదీర్ఘమైన సినిమాను రూపొందించేందుకు నిర్ణయించుకున్నాడు.

 

'ఆంబియన్స్', పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మూకీ సినిమాగా రూపొందిస్తున్నారు. డైలాగులు లేకుండా తెరకెక్కుతున్న ఈసినిమాను తన చివరి చిత్రంగా 2020లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా డ్యూరేషన్ 720 గంటలు, అంటే సరిగ్గా 30 రోజులు. ఇప్పటికే 400 గంటల షూటింగ్‌ను పూర్తి చేశారు.

 

2018లో 72 నిమిషాల  నిడివి కలిగిన ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. 100 మంది నటులతో తీసే ఈ సినిమాను 2020లో ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదల చేసి, కేవలం ఒక షో మాత్రమే వేస్తారట. ఆ తరువాత మరెవూ ప్రదర్శించడానికి వీలు లేకుండా సినిమా కాపీలను తగులబెట్టాలని భావిస్తున్నాడు. ఆయనే నిర్మాత కూడా కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ కాపీలను తగులపెట్టాలన్న ఆలోచనపై పెద్ద ఎత్తు విమర్శలు వినిపిస్తున్నాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top