సూపర్ ఛాన్స్!?

సూపర్ ఛాన్స్!?


తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో విడాకులకు ముందడుగు వేసిన తర్వాత అమలా పాల్‌కు తమిళంలో అవకాశాలు తగ్గాయనే వార్త ప్రచారంలో ఉంది. విజయ్ తండ్రి అళగప్పన్ అవకాశాలు రానివ్వకుండా చక్రం తిప్పుతున్నారని టాక్. కానీ, ఈ బ్యూటీకి సూపర్ ఛాన్స్ వచ్చిందని తాజా సమాచారం. ఏకంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసనే ఛాన్స్ వచ్చిందట.



 పా.రంజిత్ దర్శకత్వంలో రజనీ హీరోగా ఆయన అల్లుడు ధనుష్ నిర్మించనున్న సినిమాలో అమలా పాల్‌ను హీరోయిన్ గా ఎంపిక చేశారట. ధనుష్ హీరోగా నటించి, నిర్మించిన ‘వీఐపీ’లో ఆయన సరసన, ధనుష్ నిర్మించిన ‘అమ్మా కనక్కు’ సినిమాల్లో ఆమె నటించారు. ప్రస్తుతం ధనుష్ హీరోగా నటిస్తూ, నిర్మాణ భాగస్వామిగా వ్యవహ రిస్తున్న ‘వడ చెన్నై’లోనూ అమలాపాలే నాయిక. ధనుష్, అమలాపాల్ మంచి స్నేహితులనీ.. అందుకే, మామగారికి జోడీగా చాన్స్ ఇవ్వాలనుకుంటున్నారనీ కోడంబాక్కమ్ వర్గాల సమాచారం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top