అల్లువారబ్బాయి క్లారిటీ ఇచ్చాడు
శనివారం అల్లు శిరిష్ 'తర్వలోనే నాకు శ్రీరస్తు శుభమస్తు' అంటూ చేసిన ట్వీట్ సినీ అభిమానులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అల్లు వారింట మరోసారి పెళ్లి భాజాలు మొగనున్నాయా అన్న డౌట్ అందరికీ వచ్చింది. అయితే తన సినిమాను ప్రమోట్ చేసుకోవటం కోసం అల్లు శిరీష్ ఈ తరహా ట్వీట్‌తో అందరి దృష్టి ఆకర్షించాడు.
ప్రస్తుతం అల్లు శిరీష్ తమ సొంతం నిర్మాణ సంస్థలో పరుశురాం దర్శకత్వంలో ఓ రొమాంటిక్ డ్రామాలో నటిస్తున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీరస్తు శుభమస్తు అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని కన్ఫామ్ చేస్తు శిరీష్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ట్వీట్ చేయడంతో, అల్లు వారి పెళ్లిసందడి ఇప్పట్లో లేదని తేలిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న శ్రీరస్తు శుభమస్తు సినిమాను వేసవిలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
This summer, Love conquers all. SRIRASTU SUBHAMASTU. Like I asked yesterday, I need your best wishes for this. pic.twitter.com/sAe6AvnOMv
— Allu Sirish (@AlluSirish) February 14, 2016