ఆ హీరో బ్యాచిలర్ లైఫ్కు శుభం కార్డు

ఆ హీరో బ్యాచిలర్ లైఫ్కు శుభం కార్డు


హైదరాబాద్ : అల్లరిని తన ఇంటి పేరుగా మార్చుకున్న హీరో నరేష్ తన బ్యాచిలర్ లైఫ్కు శుభం కార్డు వేయబోతున్నాడు.   శుక్రవారం ( మే 29) రాత్రి 9 గంటల 3 నిమిషాలకు నరేష్..  విరూప మెడలో మూడుముళ్లు వేయబోతున్నాడు.  హైదరాబాద్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వివాహాం జరుగబోతోంది.  మరోవైపు అల్లరి నరేష్ నివాసం.. పెళ్లి సందడి తో కళకళలాడుతోంది.  కుటుంబ సభ్యులు నిన్న అతడిని పెళ్లికొడుకును చేశారు. కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.



మరోవైపు ఓ ఇంటివాడు కాబోతున్న నరేష్ ఇటీవల తన స్నేహితులకు బ్యాచిలర్ పార్టీ కూడా ఇచ్చాడు.  ఈ సందర్భంగా స్నేహితులు... మరో వికెట్ డౌన్ అంటూ అతడిని ఆట పట్టించారు.  నరేష్ స్నేహితులు నాని, నిఖిల్, తరుణ్, ఖయ్యుం, శశాంక్ తదితరులు టీజ్ చేస్తూ ఫోటో దిగారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top