రెండోసారి దొరికిపోయా!
‘‘ఇండస్ట్రీలోకి రాకముందు జరిగిన సంఘటన ఇది. ఓ సారి ఆటో ఎక్కాను. ఆటో వాణ్ణి మాటల్లో పెట్టి మీటర్ లాగాను. నేను దిగే సమయానికి 28 రూపాయలు ఉన్నది కాస్తా రూ. 8 రూపాయాలయింది. అతనికి విషయం అర్థమై నాతో గొడవ పెట్టుకున్నాడు. అయినా నేను 8 రూపాయలే ఇచ్చాను. రెండో సారి ఈ ట్రిక్ ప్రయోగించాలనుకున్నా కానీ, దొరికిపోయా. అప్పుడు ఆటో ఎక్కాక మీటర్ లాగితే... నా బ్యాడ్‌లక్ కొద్దీ రూ.40 నుంచి రూ.140 కి వెళ్లిపోయింది. నాకు షాక్ తగిలినట్టయింది. ఇక చచ్చినట్టు కట్టాల్సి వచ్చింది. జీవితంలో ఎవరినైనా మోసం చేస్తే తర్వాత అది మనకే తిప్పికొడుతుందన్న సత్యం ఆ రోజు 140 రూపాయల సాక్షిగా గ్రహించాను. ఇక అప్పటి నుంచీ ఇలాంటి వేషాలు వేయలేదు.’’
- అక్షయ్ కుమార్