నాన్నకు ఓ హీరో బంపర్ గిఫ్ట్

నాన్నకు ఓ హీరో బంపర్ గిఫ్ట్ - Sakshi


తన తొలి సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న హీరో అఖిల్.. తన తండ్రి అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఓ మంచి బహుమతి ఇచ్చాడు. నాగార్జున, రమ్యకృష్ణ జంటగా నటిస్తున్న 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమా టీజర్ను యూట్యూబ్లో విడుదల చేసి, ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తన తండ్రి అభిమానులకు, తన అభిమానులకు తెలియజేశాడు.



ఆ టీజర్ లింకును కూడా అందులో షేర్ చేశాడు. నాగార్జున, రామ్మోహన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో రెండో హీరోయిన్గా లావణ్యా త్రిపాఠీ నటిస్తోంది. బుల్లితెర యాంకర్ అనసూయ కూడా ఈ సినిమాలో నాగార్జునకు మేనకోడలిగా నటిస్తోంది.


 

 

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top