సూపర్‌స్టార్ టైటిల్‌తో మరోసారి ధనుష్
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రాల టైటిల్స్‌లో నటించాలని ఈ తరం హీరోలు చాలా ఆసక్తి చూపుతుండటం గమనార్హం. ముఖ్యంగా ఈ విషయంలో నటుడు ధనుష్ ముందున్నారని చెప్పవచ్చు. ఇంతకు ముందు పోల్లాదవన్, పడిక్కాదవన్, మాప్పిళ్లై వంటి రజనీకాంత్ చిత్రాల టైటిల్స్‌లో నటించిన ధనుష్ తాజాగా తంగమగన్గా రానున్నారు. ఇదీ గతంలో రజనీకాంత్ నటించిన చిత్ర టైటిల్‌నే కావడం గమనార్హం. కాగా ఇంతకుముందు ధనుష్ హీరోగా వేల్రాజ్ దర్శకత్వంలో రూపొందిన వేలై ఇల్లా పట్టాదారి చిత్రానికి సీక్వేల్‌గా అదే కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి వీఐపీ-2 అంటూ ప్రచారం జరుగుతూ వచ్చింది.
అయితే ఇది వేలై ఇల్లా పట్టాదారి చిత్రానికి సీక్వెల్ కాదు, అలాగే ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదు అని, త్వరలోనే టైటిల్‌ను నిర్ణయిస్తామని ధనుష్ ఇటీవల పేర్కొన్నారు. అన్నట్టు ఈ చిత్రానికి నిర్మాత ఈయనే అన్నది గమనార్హం. సమంతా, ఎమీజాక్షన్లు హీరోయిన్లుగా నటించారు. ఇతర ముఖ్యపాత్రల్లో సతీశ్, రాధిక, దర్శకుడు కేఎస్.రవికుమార్ తదితరులు నటించారు. ఇప్పుడీ చిత్రానికి తంగమగన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు.
దీని ఫస్ట్‌లుక్ పోస్టర్లను ధనుష్ తన ట్విట్టర్లో విడుదల చేశారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఆ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. అనిరుద్ సంగీత భాణీలు అందిస్తున్న చిత్ర టీజర్‌ను, ఆడియోను త్వరలోనే విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమచారం.