స్కూటర్ సవారీ దేని కోసం?
జస్ట్ ఏడాది క్రితం అమితాబ్ బచ్చన్ కోల్కత్తా వీధుల్లో సైకిల్ సవారీ చేశారు. బిగ్ బి చేసిన ఆ సవారీని చూడ్డానికి బోల్డంత మంది జనాలు గుమిగూడారు. అమితాబ్ ఇలా సైకిల్ తొక్కింది ‘పీకు’ సినిమా కోసమేనని ప్రత్యేకంగా గుర్తు చేయక్కర్లేదు. ఈసారి అమితాబ్ కోల్కత్తా వీధిలో స్కూటర్ సవారీ చేశారు. ప్రస్తుతం నటిస్తున్న ‘తీన్’ షూటింగ్లో భాగంగానే అమితాబ్ ఇలా స్కూటర్ నడిపారు.
కొన్ని సెకన్ల పాటు అమితాబ్ స్కూటర్ నడపగా దర్శకుడు సూజిత్ సర్కార్ చిత్రీకరించారు. అమితాబ్ స్కూటర్ నడపడాన్ని పెద్ద వింతలా చూశారు అక్కడి జనాలు. అవును మరి.. పడవలాంటి కారులో తిరిగే అమితాబ్ ఎర్రటి ఎండలో స్కూటర్ మీద వెళితే కచ్చితంగా అది వింతే కదా. అది సినిమా కోసమే అయినా ‘అమితాబ్ స్కూటర్ నడిపారు’ అని షూటింగ్ చూసినవాళ్లు గొప్పగా చెప్పుకున్నారు. అమితాబ్, నవాజుద్దీన్ సిద్ధిఖి, విద్యాబాలన్ ముఖ్య తారలుగా సుజోయ్ ఘోష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సంబంధిత వార్తలు