మా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది

మా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది


మా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందని అంటున్నారు అందాల భామ హన్సిక. తమిళ చిత్రాలకే ప్రాముఖ్యత అంటున్న ఈ ఉత్తరాది బ్యూటీ ఇటీవల ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా నటించిన మనిదన్ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించడంతో ఆ సంతోషాన్ని అనుభవిస్తూ తాజాగా భోగన్ చిత్రంలో జయంరవితో రొమాన్స్ చేస్తున్నారు.

 

 ఇది ఆమె జయంరవితో నటిస్తున్న మూడో చిత్రం అన్నది గమనార్హం. ముందుగా ఎంగేయుమ్ కాదల్ చిత్రంలో నటించారు. తరువాత రోమియో జూలియట్ చిత్రంలో జత చేరారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా భోగన్ చిత్రంలో మరో సారి కలిసి నటిస్తున్నారు. విశేషం జయంరవితో నటించిన తొలి చిత్రానికి ప్రభుదేవా దర్శకుడు. ఈ భోగన్ చిత్రానికి ఆయన నిర్మాత. రోమియో జూలియెట్ చిత్రం దర్శకుడు లక్ష్మణ్‌నే భోగన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. దీని వివరాల గురించి హన్సికతో చిన్న భేటీ..


 ప్ర: మనిదన్ చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తునట్లున్నారు?

 జ: మనిదన్ నాకు చాలా నచ్చిన చిత్రం. అందులో గ్రామీణ యువతిగా నటించాను. ఇంతకు ముందు అరణ్మణై చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా నటించినా, మనిదన్ చిత్రంలో నా పాత్ర చాలా వైవిధ్యంగా అమరింది.  నా గత చిత్రాల పాత్రలకు మనిదన్ చిత్రంలోని పాత్ర పూర్తిగా భిన్నం. అందుకే చాలా ఆస్వాదిస్తూ నటించాను. అందుకు మంచి పేరు వచ్చింది.



 ప్ర: ఉదయనిధి స్టాలిన్‌తో రెండో సారి నటించడం గురించి?

 జ: అవును.అయన తొలి చిత్రం ఒరు కల్లు ఒరు కన్నాడి చిత్ర నాయకిని నేనే. ఇంకో విషయం ఏమిటంటే మేమిద్దరం కలిసి మరో చిత్రంలో నటించాల్సింది. అది పూర్తిగా అమెరికాలో జరిగే కథ. దానికి అహ్మద్‌నే దర్శకత్వం వహించాల్సి ఉంది.అందులో నాది చాలా గ్లామరస్ పాత్ర. అయితే ఆ చిత్రం ప్రారంభం కాలేదు. అందుకే మనిదన్ చిత్రంలో నటించమని అడిగారు. తొలి చిత్రంలో నటించినప్పుడు ఉదయనిధి కొత్తనిపించారు. ఇప్పుడు నటనలో ఆరితేరారు. మంచి స్నేహితుడు.



 ప్ర: సరే తాజా చిత్రం బోగన్ గురించి?

 జ:  నేను ఇంతకు ముందు జయంరవితో కలిసి నటించిన రోమియో జూలియెట్ చిత్రం మంచి హిట్. మా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందని దర్శకుడు లక్ష్మణ్ అన్నారు. అందుకే మళ్లీ బోగన్ చిత్రంలో కలిసి నటిస్తున్నాం.



 ప్ర: బోగన్ చిత్రం కథేంటి?

 జ: కథ గురించి ఇప్పుడే చెప్పకూడదు.



 ప్ర: హిందీ చిత్రాల్లో నటించే  ఆలోచన ఉందా?

 జ: నాకు తమిళ చిత్రాలలో నటించడానికే సమయం సరిపోతోంది. అందుకే తమిళ చిత్రాలకే ప్రాముఖ్యత నిస్తున్నాను.



 ప్ర: ఇన్ని చిత్రాల్లో నటించినా  ఇంకా తమిళ భాష నేర్చుకోలేక పోయారుగా?

 జ: ఎవరు చెప్పారు? తమిళంలో ఏమి మా ట్లాడినా నాకు అర్థం అవుతుంది. కొంత వర కూ మాట్లాడగలను. త్వరలోనే తమిళ భాష ను పూర్తిగా మాట్లాడగలను. అందుకే తమిళ చిత్రాల్లోనే నటించాలని ఆశపడుతున్నాను.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top