సినిమా చాన్సు ఇవ్వలేదని హీరోకు గుండుగీశారు!
తమ బంధువైన అమ్మాయికి సినిమాల్లో నటించే అవకాశం ఇవ్వలేదన్న కోపంతో.. ఆమె బంధువులు, స్నేహితులు కలిసి ఓ హీరోకు గుండు గీసి.. అతడిని కొట్టారు. ఆడిషన్స్ తీసుకోడానికి అర్జున్ కర్ణాటకలోని బళ్లారికి వచ్చారు. అప్పుడు రోష్ని అనే యువతి ఆయన వద్దకు వచ్చి, తనకు హీరోయిన్ అవకాశం ఇవ్వాలని కోరింది. కానీ, ఆమెకు నటనా రంగంలో ఏమాత్రం అనుభవం లేకపోవడంతో ఆయన తిరస్కరించారు.
దాంతో రోష్ని బావ అమిత్ మరో 15-20 మందితో కలిసి అర్జున్ ఆఫీసుకు వచ్చి, ఆయనను ప్రేమ్‌నగర్ ప్రాంతంలోని ఇంటికి తీసుకెళ్లి అక్కడ ఆయనపై దాడి చేసి, జట్టు కత్తిరించేశారు. దాంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్య పూజ, మరో నటుడిపై కూడా రోష్ని బంధువులు దాడికి పాల్పడినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితునిపై ప్రేమ్‌నగర్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలైంది. అతడిని అరెస్టు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఏఎస్పీ రాజీవ్ మల్హోత్రా చెప్పారు.