హీరో అజిత్ అభిమానులకు శుభవార్త

హీరో అజిత్ అభిమానులకు శుభవార్త


నటుడు అజిత్ అభిమానులకు శుభవార్త. అభిమానులు తల అని పిలుచుకునే అజిత్ రెండో బిడ్డకు తండ్రి కాబోతున్నారన్నది తాజా సమాచారం. నటుడు అజిత్ జీవన శైలి ప్రత్యేకం అన్న విషయం పరిశ్రమలోని వారందరికీ తెలుసు. సినిమా, కుటుంబం ఈ రెండు అంశాలు మినహా అజిత్ ఇతర విషయాలపై అంతగా ఆసక్తి చూపరు. ఇక తనకిష్టమైన వాటిలో బైక్ రేస్ ఒకటి. ఈయన సూపర్ బైక్ రేసర్ అన్న విషయం తెలిసిందే. అదే విధంగా ఫొటోగ్రఫీ అంటే అజిత్‌కు మంచి క్రేజ్.

 

ప్రకృతిలో తన కంటికి అందం అనిపించిన వాటిని కెమెరాలో బంధిస్తారు. కాగా 2000లో నటి శాలినిని ప్రేమించి పెళ్లి చేసుకున్న అజిత్‌కు ఆమె అంటే అమిత ప్రేమ. అన్యోన్య దంపతులుగా పేరు పొందిన వీరికి 2008లో పాప (అనౌష్క) జన్మించింది. ఈ గారాల బిడ్డకిప్పుడు ఆరేళ్లు. అరుుతే శాలిని ఇప్పుడు మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారన్నది సమాచారం. ఆమె తరచూ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లొస్తున్నారు. త్వరలో తలను రెండో సారి తండ్రిని చెయ్యబోతున్నారని సమాచారం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top