అభిషేక్‌కు షాక్!
స్టార్ హీరో అభిషేక్‌బచ్చన్ పక్కన అవకాశం ఇస్తాం అంటే... క్యూలో ఉంటారు తారలు. ఇక చిన్నాచితక నటీమణులైతే చెప్పక్కర్లేదు... అడిగిందే తడవుగా అతగాడితో ఎప్పుడెప్పుడా అని షూటింగ్ కోసం ఎదురు చూస్తుంటారు. కానీ... బుల్లితెర సీరియల్ ‘ససురాల్ సిమార్ కా’ నటీమణులు అవికా గోర్, దీపికా శాంసన్ బంపర్ ఆఫర్‌ను సింపుల్‌గా తిరస్కరించారు. బాలీవుడ్ మెగా పర్సనాలిటీ ఫరాఖాన్ హోస్ట్ చేస్తున్న వంటల కార్యక్రమం ‘ఫరా కీ దావత్’లో అభిషేక్ తనకిష్టమైన టేస్ట్‌ను చూపిస్తాడు.
ఈ ఎపిసోడ్ కోసం అవిక, దీపికలను సంప్రదిస్తే... అభిషేక్ పక్కన కనిపించడానికి భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారట. ఇలాంటి అవకాశాలు మళ్లీ మళ్లీ రావంటూ సదరు ప్రొడ్యూసర్ నచ్చజెప్పబోయినా... డోంట్ కేర్ అనేశారట. దెబ్బకు షాకైన నిర్మాత... కాసేపటికి తేరుకుని ఈ భామలిద్దరికీ ఓ దండం పెట్టాడట!
సంబంధిత వార్తలు