33 కోట్ల సినిమాకు 500 కోట్ల వసూళ్లు!

'ది విజిట్'లో ఓ దృశ్యం


  కేవలం 30 రోజులే షూటింగ్  

  యూనిట్‌లో పాతికమందే

  నో గ్రాఫిక్స్  నో బ్యాగ్రౌండ్ స్కోర్


 

 ఓ చిన్న సినిమా  హాలీవుడ్‌ను ఉలిక్కిపడేలా చేసింది. ఓ భారీ బడ్జెట్ సినిమా పబ్లిసిటీకి  ఖర్చు పెట్టేంత డబ్బుతో ఓ హారర్  సినిమా తీసి బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు  రాబట్టుకోవమంటే మాటలు కాదు.  ఆ సినిమా పేరు  ‘ది విజిట్’.


 దాని బడ్జెట్ ఎంతో తెలుసా?

 కేవలం 33 కోట్ల రూపాయలు.

 తీసింది మనవాడే.

 ఎస్... మన భారతీయ మూలాలున్న  మనోజ్ నైట్ శ్యామలన్.

 ద సిక్త్స్ సెన్స్...

 అన్ బ్రేకబుల్...

 ది విలేజ్..

 సైన్స్...

 ది లాస్ట్ ఎయిర్ బెండర్...

 ఆఫ్టర్ ఎర్త్..

 ఈ సినిమాలన్నీ తీసింది  శ్యామలన్.

 తండ్రి మలయాళీ, తల్లి తమిళం

 చిన్నతనంలోనే అమెరికాలో స్థిరపడిన శ్యామలన్ హాలీవుడ్‌లో తనకంటూ ఓ సిగ్నేచర్ ఏర్పరచుకున్నాడు. ఇటీవల కాలంలో శ్యామలన్ తీసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడ్డాయి. ఇక దుకాణం బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఓ రకమైన  నైరాశ్యం.

ఆ టైమ్‌లో శ్యామలన్ బుర్ర షార్ప్‌గా పనిచేసింది. చాలా లో బడ్జెట్‌లో హారర్ సినిమా తీయాలి. అదీ తన మార్కులో ఉండే సినిమా.

 ఇందులో ఆర్టిస్టులెవ్వరూ వెల్‌నోన్ ఫేసులు కాదు.  ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులు... మిగతా వాళ్లంతా పేరులేని యాక్టర్స్. నో గ్రాఫిక్స్... నో సెట్స్... అంతా నేచురల్ సెటప్.


 ఇంకా విచిత్రం ఏంటంటే ఈ సినిమాకి నో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. అలా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేకుండా సినిమా చేయాలనేది శ్యామలన్ కొన్నేళ్ల నాటి డ్రీమ్. ఈ సినిమాతో అది నెరవేర్చుకున్నాడు. మామూలుగా హారర్ సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోరే ఇంపార్టెంట్. చాలామంది దాని మీదే డిపెండ్ అవుతారు. శ్యామలన్ మాత్రం సెలైన్స్‌నే నమ్ముకున్నారు. ఎంత సెలైంట్‌గా ఉంటే అంత వయొలెంట్‌గా ఉంటుందనుకున్నాడేమో! తలుపు చప్పుళ్లు... అడుగుల శబ్దాలు...ఇవన్నీ  సౌండ్ ఎడిటర్స్ ఒరిజినల్‌గా లొకేషన్‌లోనే రికార్ట్ చేశారు.

 స్క్రిప్టు ఆర్డర్‌లోనే షూటింగ్  కూడా చేశారు.


 టీమ్ కూడా చాలా తక్కువే.  కేవలం పాతిక మంది టెక్నీషియన్స్

30 రోజుల్లో షూటింగ్ పార్ట్ కంప్లీట్.

ఎడిటింగ్ రూమ్‌లో ఫస్ట్ కట్ చూసి అందరూ షాక్.

 ఏదో ఆర్ట్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్.


సెకండ్ కట్ అయితే ఇంకా దారుణం. కామెడీ ఫిల్మ్‌లా అనిపించింది. శ్మామలన్ రాత్రింబవళ్లూ ఎడిటింగ్ రూమ్‌లోనే కూర్చున్నాడు. సీన్ బై సీన్ చూస్తూ దగ్గరుండి ఎడిటింగ్ చేయించుకున్నాడు. ఫైనల్ అవుట్‌పుట్ రెడీ. 2014 ఏప్రిల్ 15న ఫస్ట్ ట్రైలర్ వదిలాడు. ఓ బామ్మ తన మనవరాల్ని తన చేతుల్తో స్టీమ్ ఓవన్‌లో తోసేస్తుంది. ట్రైలర్ చూసి అందరూ షాక్. అప్పట్నుంచీ సినిమాపై క్యూరియాసిటీ మొదలైంది.


 2015, సెప్టెంబరు 11న ‘ది విజిట్’ రిలీజైంది.

 ఫస్ట్ షోకే రిజల్ట్ తెలిసిపోయింది.

 సినిమా సూపర్‌హిట్. ఇప్పటివరకూ 500 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.

 వరల్డ్‌లో ఇంకా చాలా చోట్ల రిలీజ్ కావాల్సి ఉంది.

 ఇండియాలో కూడా ఇంకా రిలీజ్ కాలేదు.

 మొత్తానికి శ్యామలన్ హాలీవుడ్‌ను గెలిచాడు.

 ఇందుకు మనమూ హ్యాపీ ఫీలవ్వాలి.

 

‘ది విజిట్’ కథ ఏంటంటే

క్రిస్మస్‌ను తమ అమ్మమ్మ, తాతయ్యల దగ్గర జరపుకోవాలని రెబెక్కా, టైలర్‌లు భావిస్తారు. ఎప్పటి నుంచో వాళ్లకూ, వీళ్లకూ మధ్య రాకపోకలుండవు. అయినా ఈసారి ఎలాగైనా వెళ్లి అక్కడి అనుభవాలను ఓ డాక్యుమెంటరీగా తీయాలనుకుంటారు. ఇద్దరూ వాళ్ల అమ్మను ఒప్పించి అక్కడికి వెళతారు. మనవడు, మనవరాలిని చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబవుతారు వాళ్లు.



అంతా బాగానే ఉంటుంది. కానీ రాత్రి 9:30 దాటితే వాళ్లున్న గది నుంచి బయటకు రాకూడదని కండీషన్ పెడతారు. సడన్‌గా వాళ్ల ప్రవర్తనలో తేడా వస్తుంది. అసలు వాళ్లు నిజంగా అమ్మమ్మ, తాతయ్యలేనా? ఆ ఇంట్లో ఏం జరుగుతోంది? అక్కణ్ణుంచీ తప్పించుకోవడానికి వీళ్లు ఎన్ని తిప్పలు పడ్డారన్నది మిగిలిన కథ.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top