పది రోజులు... వసూళ్లు రెండు కోట్లు!

పది రోజులు... వసూళ్లు రెండు కోట్లు!


‘‘తమిళంలోనూ ‘16’ చిత్రం నెమ్మదిగానే సక్సెస్‌ సాధించింది. తెలుగులో పెద్ద హిట్‌ కావడం హ్యాపీ. అన్నీ అనుకున్నట్లు కుదిరితే శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్‌ బ్యానర్‌లో ఓ తెలుగు సినిమా చేస్తా’’ అని దర్శకుడు కార్తీక్‌ నరేన్‌ అన్నారు. రెహమాన్, ప్రకాష్‌ విజయ్‌ రాఘవన్, అశ్విన్‌ కుమార్‌ ముఖ్య పాత్రల్లో కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘16’ను చదలవాడ బ్రదర్స్‌ సమర్పణలో చదలవాడ పద్మావతి తెలుగులో ఈ నెల 10న విడుదల చేశారు. సోమవారం నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘16’ సినిమా విడుదలకు థియేటర్స్‌ దొరకలేదు.



కథపై నమ్మకంతో మొదట ఒక్క థియేటర్‌లోనే విడుదల చేశా. తర్వాత థియేటర్స్‌ పెరిగాయి. విడుదలైన అన్నిటిలోనూ హౌస్‌ఫుల్‌గా రన్‌ అవుతూ ఇప్పటికి రెండు కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా సక్సెస్‌ క్రెడిట్‌ డైరెక్టర్‌దే’’ అన్నారు. చదలవాడ లక్ష్మణ్‌ మాట్లాడుతూ – ‘‘కథాబలం ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ‘బిచ్చగాడు’, ‘16’ సినిమాలు నిరూపించాయి. తక్కువ బడ్జెట్‌లో సినిమా తీసి కార్తీక్‌ నరేన్‌ చాలామంది దర్శకులకు స్ఫూర్తిగా నిలిచారు’’ అన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top