'ప్రతి రోజూ అత్యాచారం చేసేవారు'

'ప్రతి రోజూ అత్యాచారం చేసేవారు' - Sakshi


లండన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మహిళల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వందలాది మంది మహిళలను కిడ్నాప్ చేసి హింసించడం, సామూహిక అత్యాచారం చేయడం, బలవంతంగా వారి ద్వారా పిల్లలను కనడం వంటి అరాచకాలకు పాల్పడుతున్నారు. 9 నెలలు ఐఎస్ ఉగ్రవాదుల చెరలో ఉండి, వారి నుంచి తప్పించుకున్న ఓ బాధితురాలి తన వ్యథను తెలియజేసింది. ఐఎస్ ఉగ్రవాదులు జిహాదీ పేరుతో చేస్తున్న హింసను ఇరాక్లోని సింజన్ పట్టణానికి చెందిన 17 ఏళ్ల యజీదీ తెగ అమ్మాయి వెల్లడించింది.



 'గతేడాది ఆగస్టులో నన్ను, నా సోదరిని ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. మమ్మల్ని సిరియాలో ఐఎస్ ఆధీనంలో ఉన్న రక్కాకు తరలించారు. మా ఇద్దరితో పాటు పదుల సంఖ్యలో యువతులకు కన్యత్వ పరీక్షలు చేయించారు. మమ్మల్నందరినీ ఓ గదిలోకి తీసుకెళ్లి వరుసగా నిలబెట్టారు. ఉగ్రవాదులు తమకు నచ్చిన అమ్మాయిలను ఎంచుకున్నారు. అందంగా లేకపోవడం నా అదృష్టం కావచ్చు. నన్ను, నా చెల్లిని, మరో ఇద్దరు అమ్మాయిలను అమ్మేశారు. చెచెన్యాకు చెందిన అల్-రషియా అనే ఐఎస్ ఉగ్రవాదికి మమ్మల్ని కొనుగోలు చేశాడు. మమ్మల్ని రోజూ ఉదయం నగ్నంగా నిలబెట్టేవారు. యజమాని తనకు నచ్చినవారిని అత్యాచారం చేసేవాడు. ఆయనతో పాటు అనుచరులు మమ్మల్ని రోజూ దారుణంగా హింసించి సామూహిక అత్యాచారం చేసేవారు. వారి శారీకవాంఛలు తీర్చకపోతే వేడి నీళ్లను కాళ్లపై పోసి చిత్రహింసలు పెట్టేవారు. ఆ తొమ్మిది నెలలూ చస్తూ బతికాను. నన్ను గర్భవతిని చేశారు. గత నెలలో అల్ -రషియాను, అతని బాడీగార్డులను ఖుర్దిష్ సైనికులు కాల్చివేశారు. దీంతో మాకు స్వేచ్ఛ లభించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top