అరటన్ను వ్యక్తి 175 కిలోలు తగ్గాడు

అరటన్ను వ్యక్తి 175 కిలోలు తగ్గాడు

మెక్సికో: ప్రపంచంలోనే భారీ స్థూల కాయుడైన జువాన్‌ పెడ్రో ఫ్రాన్స్‌కో (32)  ఎట్టకేలకు 175 కిలోల బరువు తగ్గాడు. ఈ విషయాన్ని అతనికి ట్రీట్‌మెంట్‌ అందిస్తున్న మెక్సికో డాక్టర్లు బుధవారం మీడియాకు తెలిపారు.  595 ​కిలోల బరువు ఉన్న జువాన్‌కు మూడు నెలలుగా చికిత్స అందించి గ్యాస్ట్రిక్‌ బైపాస్‌ సర్జరీ ఆపరేషన్‌కు సిద్దం చేశారు. ఈ ఆపరేషన్‌ మే 9 నిర్వహిస్తున్నట్లు డాక్టర్‌  జోస్ ఆంటోనియో కాస్తానేడ్‌ క్రజ్‌ తెలిపారు. అరటన్ను బరవున్న జువాన్‌ది సెంట్రల్‌ మెక్సికోలోని ఆగ్వాస్కాలియెంట్స్‌ అనే ప్రాంతం. గతేడాది నవంబర్‌లో ఎలగైన  అతని బరువును తగ్గించేందుకు మెక్సికోలోని జార్డెన్స్‌ దే గ్వాడలుపే డే జపోపాన్‌ ఆస్పత్రి ముందుకొచ్చింది. ఆపరేషన్‌ చేసేందుకు వీలుగా అతనికి డైట్‌ ఇచ్చి 175 కిలోలు తగ్గించారు. ఇప్పుడు అతను ఆపరేషన్‌కు సిద్దంగా ఉన్నాడని డాక్టర్లు తెలిపారు.  ప్రస్తుతం అతని బరువులో 30 శాతం బరువు తగ్గాడని, ఈ స్థితిలో ఆపరేషన్‌ చేయవచ్చని డాక్టర్లు పేర్కొన్నారు.



ఫ్రాన్స్‌కోను ఆసుపత్రి తీసుకెళ్లినపుడు అధిక బరువు, డయబేటిస్‌ సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ స్ధితిలో ఆపరేషన్‌ చేయడం కుదరలేదని డాక్టర్లు తెలిపారు. అతని ప్రస్తుత బరువులో 50 శాతం తగ్గించడమే ఈ ఆపరేషన్‌ లక్ష్యమని, తర్వాత రెండో ఆపరేషన్‌ అవసరమయితే చేస్తామని డాక్టర్‌ క్యాస్టెనెడా తెలిపారు.తనలా స్థూలకాయంతో బాధపడేవారున్నారని, సహాయం కోరే దైర్యం లేక వారిలో వారు కుమిలిపోతున్నాని, మరికొంత మంది మరణించారని ఫ్రాన్స్‌కో అన్నాడు. స్ధూలకాయులంతా అవసరమైతే గొంతెత్తి సహాయం కోరాలని ఫ్రాన్స్‌కో వేడుకున్నాడు. అధిక బరువుతో బాధపడుతున్న ప్రాన్స్‌కో ఆన్‌లైన్‌ ఆడ్స్‌ ద్వారా క్లినిక్‌ను సంప్రదించాడు. గత ఆరు సంవత్సరాలుగా ఫ్రాన్స్‌కో అధిక బరువుతో బాధపడుతున్నాడు. 
Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top