30వేల అడుగుల ఎత్తులో ప్రసవం

30వేల అడుగుల ఎత్తులో ప్రసవం


30వేల అడుగుల ఎత్తులో నెలలు నిండని శిశివుకు ఓ తల్లి జన్మనిచ్చింది. ఈ సంఘటన బాలీ నుంచి లాస్ ఏంజెల్స్ ప్రయాణిస్తున్న చైనా ఏయిర్ లైన్స్ విమానంలో చోటు చేసుంకుంది. దూరప్రయాణం చేస్తున్న తైవాన్కు చెందిన మహిళకు డెలివరీ సమయానికన్నా 8 వారాలు ముందుగానే పురిటి నోప్పులు  వచ్చాయి. విమానంలో ఉన్న డాక్టర్కు సిబ్బంది సమాచారాన్ని అందించారు. దీంతో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ పురిటి నొప్పులు ఎక్కువగా రావడంతో విమానంలోని డాక్టర్, సిబ్బంది సహాయంతో మహిళకు డెలివరీ చేశారు. ఆ మహిళ ఆడ పిల్లకు జన్మనిచ్చింది.



ఈ డెలివరీ అనంతరం జరిగిన పరిణామాలను ఓ ప్రయాణికుడు వీడియో తీశాడు. డెలివరీ చేసిన సిబ్బంది విమానంలోని దుప్పట్లలోకి ఆ పసికందును సంతోషంగా తీసుకోవండం, టిష్యూ పేపర్లతో ఆ చిన్నారిని, తల్లిని శుభ్రపరిచిన దృశ్యాలు అందులో ఉన్నాయి.



 ఈ సంఘటనతో విమానాన్ని అత్యవసరంగా అలస్కాలోని టెడ్ స్టీవెన్స్ ఆంకరేజ్ విమానాశ్రయంలో నిలిపి తల్లి, బిడ్డలను ఆంకరేజ్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి,  బిడ్డ ఇద్దరు  క్షేమంగానే ఉన్నారు. మూడు గంటల ఆలస్యం అనంతరం ఆ విమానం మిగతా ప్రయాణికులతో లాస్ ఏంజెల్స్ చేరుకుంది.

 

అనుకోకుండా జరిగిన ఈ పరిణామానికి విమాన సిబ్బంది, ప్రయాణికులు  తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎన్నో ప్రయాణాలు చేశాను కానీ ఇలా విమానంలో నేను ప్రయాణిస్తున్న సమయంలోనే శిశివు జన్మించడం మరచిపోలేని సంఘటన అని ఓ ప్రయాణికుడు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఆ బిడ్డ విమానంలోనే జన్మించడంతో ఆంకరేజ్ లోని ఆస్పత్రి వర్గాలు ఇచ్చే బర్త్ సర్టిఫికెట్ ఆధారంగానే ఆ పసికందు జాతీయత ఆధారపడనుంది.




 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top