'మట్టిని నమ్ముకున్న వ్యక్తి రాబోయే రోజుల్లో ధనవంతుడు కావాలి'
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం అంతర్జాతీయంకథ

వెనిజులా ఉపాధ్యక్షుడిపై అమెరికా వేటు

Others | Updated: February 14, 2017 09:14 (IST)
వెనిజులా ఉపాధ్యక్షుడిపై అమెరికా వేటు
వాషింగ్టన్‌: అమెరికా నిషేధాల పర్వానికి మరింత పదును పెడుతోంది. మొన్నటి వరకు దేశాలపై నిషేధాలు ప్రకటించిన ఆ దేశం ఇప్పుడు ఆయా దేశాల ప్రతినిధులపై వేటు వేస్తోంది. నిన్నటికి నిన్న పాక్‌ సెనేట్‌ డిప్యూటీ స్పీకర్‌కు వీసా ఇచ్చేందుకు నిరాకరించిన అమెరికా తాజాగా వెనెజులా ఉపాధ్యక్షుడు తారెక్‌ ఎల్‌ ఐస్సామిపై నిషేధం విధించింది. అతడిని మత్తుపదార్థాల చేరవేతదారుడిగా గుర్తిస్తూ అతడికి తమ దేశంలోకి అనుమతి లేదంటూ బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చింది.

ఈ మేరకు అమెరికా ట్రెజరీ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ దేశ ఫారిన్‌ నార్కోటిక్స్‌ కింగ్‌పిన్‌ డెసిగ్నేషన్‌ యాక్ట్‌ కింద ఆయనపై నిషేధం విధించినట్లు తెలిపింది. అంతేకాదు.. ఆయనకు సంబంధించిన సమార్క్‌ జోస్‌ లోపెజ్‌ బెల్లోపై కూడా వేటు వేసింది. అతడే వెనిజులా ఉపాధ్యక్షుడు అక్రమ చర్యలు చేసేందుకు సహాయపడుతున్నాడని తెలిపింది. దీంతోపాటు బెల్లోకు చెందిన 13 కంపెనీలను కూడా తాము లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలిపారు.

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

అంగన్‌వాడీలపై వరాల జల్లు

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC