'బీడుబడిన భూముల్లో జలయజ్ఞంతో ఆనందపు సిరులు పండాలి'
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం అంతర్జాతీయంకథ

ఐరాస కాలక్షేప క్లబ్‌: ట్రంప్‌

Sakshi | Updated: December 28, 2016 15:43 (IST)
ఐరాస కాలక్షేప క్లబ్‌: ట్రంప్‌ వీడియోకి క్లిక్ చేయండి

వాషింగ్టన్‌: ఐక్యరాజ్య సమితిపై అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. అది కొందరికి కాలక్షేపం, ఉల్లాసాన్ని పంచే వేదికగా మారిందని అన్నారు. ‘ఐరాస ఎంతో శక్తిమంత సంస్థ. కానీ  ప్రస్తుతం అది కొందరు ఒకచోట చేరి సేదతీరే క్లబ్‌గా మారడం దురదృష్టకరం’ అని ట్వీట్‌ చేశారు.

జెరూసలెంలో ఇజ్రాయిల్‌ స్థావరాల నిర్మాణానికి వ్యతిరేకంగా భద్రతా మండలిలో జరిగిన ఓటింగ్‌కు దూరంగా ఉండాలని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నిర్ణయించడం, ఫలితంగా ఆ తీర్మానం ఆమోదం పొందిన నేపధ్యంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా వీటో అధికారాన్ని ప్రయోగించాలని ట్రంప్‌ అంతకుముందే కోరారు.

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

జనం మదిలో ఏముంది?

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC