‘క్లింటన్ మాజీ ప్రియురాలిని తీసుకొస్తా’

‘క్లింటన్ మాజీ ప్రియురాలిని తీసుకొస్తా’ - Sakshi


వాషింగ్టన్: డెముక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తో జరగనున్న చర్చాగోష్ఠికి బిల్ క్లింటన్ మాజీ ప్రియురాలు జెన్నిఫర్ ఫ్లవర్స్ ను తీసుకువస్తానని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ హెచ్చరించారు. హిల్లరీ, ట్రంప్ మంగళవారం తమ తొలి అధ్యక్ష అభ్యర్థుల చర్చాగోష్ఠిలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ‘డోపి’ మార్క్ కుబన్ ను హిల్లరీ ఆహ్వానించారని, తాను జెన్నిఫర్ ఫ్లవర్స్ ను తీసుకువస్తానని అన్నారు. ‘ఒకవేళ ఈ కార్యక్రమానికి మార్క్ కుబన్ వచ్చి ముందు వరుసలో కూర్చుంటే.. అతడి కుడివైపున జెన్నిఫర్ ఫ్లవర్స్ ను తీసుకొచ్చి కూర్చోబెడతాన’ని ట్రంప్ ట్వీట్ చేశారు.



ట్రంప్‌ పై మార్క్ కుబన్ గతంలో పలుమార్లు బహిరంగంగా విమర్శలు చేశారు. కాగా, ట్రంప్ ప్రకటనపై జెన్నిఫర్ ఫ్లవర్స్  సోషల్ మీడియాలో స్పందించారు. చర్చాగోష్ఠికి తాను కూడా వస్తున్నానని తెలిపారు. ఆమెను తాము ఆహ్వానించలేదని ట్రంప్ కాంపెయిన్ మేనేజర్ కెలియానె కన్వే తెలిపారు. ట్రంప్ తరపున అతిథిగా ఆమె రావాలని కోరుకోవడం లేదని చెప్పారు. హిల్లరీ, ట్రంప్ తొలి చర్చాగోష్ఠి కోసం అమెరికా ప్రజలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top