కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం

కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం


కాలిఫోర్నియా: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఆదివారం ఉదయం కాసినో నుంచి తిరిగొస్తున్న ఓ టూరిస్ట్‌ బస్సు... ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13మంది ప్రాణాలు కోల్పోగా, 31మంది గాయపడ్డారు. గాయపడినవారిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా కాలిఫోర్నియాలోని పామ్‌ స్ప్రింగ్స్‌ వద్ద ఈ ఘటన జరిగింది. బస్సు డ్రైవర్‌ కూడా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా... ట్రక్కు డ్రైవర్‌ గాయలతో బయటపడ్డాడు.


యూఎస్ఏ హాలీడేకు చెందిన ఈ టూరిస్ట్‌ బస్సు... రెడ్ ఎర్త్‌ కాసినో నుంచి లాస్‌ ఏంజెల్స్‌  తిరిగెళ్తూ ఉండగా ప్రమాదం సంభవించింది. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బస్సు అద్దాలు పగులగొట్టి, నిచ్చెనల సాయంతో బాధితులను రక్షించారు. మృతుల్లో ఎక్కువమంది బస్సు ముందు భాగంలో కూర్చున్నవారే. ప్రాణాలు కోల్పోయినవారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ దుర్ఘటనపై  రవాణా భద్రతా సంస్థ విచారణ చేపట్టింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top