అక్కడ ఇద్దరు లేక ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్

అక్కడ ఇద్దరు లేక ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ - Sakshi


గ్వాంగ్‌డాంగ్: దక్షిణ చైనాలోని డాంగ్వాన్ నగరం మొన్నటి వరకు ప్రపంచ ఉత్పత్తుల కేంద్రం లేదా పపంచ ఫ్యాక్టరీగానే ప్రపంచానికి తెలుసు. ఇప్పుడది గర్ల్ ఫ్రెండ్స్ నగరంగా, సెక్స్ కాపిటల్ ఆఫ్ ది చైనాగా ప్రసిద్ధి చెందుతోంది. అక్కడ ఒక్క గర్ల్ ఫ్రెండ్‌ను కలిగి ఉండడం మగవాడికి నామోషి. అలాంటి వారిని చేతకానివాడంటూ తోటి స్నేహితులే గేలి చేస్తారు. అక్కడ యవ్వనంలోవున్న ప్రతి మగవాడికి ఇద్దరు లేక ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. కొంతమందికి ఎక్కువ కూడా ఉన్నారు. వారంతా డబ్బున్న విలాస పురుషులేమీ కాదు. బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అందరూ సాధారణ కార్మికులే. ఫాక్టరీల్లో పనిచేసే ఉద్యోగస్థులే. వారికి సరాసరి నెలకు 20 వేల రూపాయల జీతం వస్తుంది.

 ఒక్క మగాడు ముగ్గురు లేదా నలుగురు గర్ల్ ఫ్రెండ్స్‌తో తిరుగుతున్నా వారి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు. ఒకరికి తెలియకుండా ఒకరితో తిరిగే ప్రసక్తే లేదు. అనేక సందర్భాల్లో వారంతా కలిసే తిరుగుతారు. ఒకే కప్పు కింద, ఒకే పడక గదిలో పడుకుంటారు. నగరంలోని కంపెనీలు మహిళా ఉద్యోగుల కోసం డార్మెట్ గదుల వసతిని కల్పిస్తోంది. ఒక్కో గదిలో ముగ్గురేసి మహిళలు ఉంటారు. అలా ఉండడం వల్ల తమకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉండడం లేదనుకున్న మెజారిటీ మహిళా ఉద్యోగులు బయట రూమ్‌లు తీసుకొని ఉంటున్నారు. బాయ్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు రూమ్‌ను ప్లాస్టిక్ కర్టెన్ల్‌తో విభజించడం లేదా వారికి ప్రైవసీ కల్పిస్తూ ఇతర గర్ల్స్ వాకింగ్‌కు అలా బయటకు వెళ్లడం అక్కడ మామూలు విషయంగా మారింది. వారి మధ్య ఎలాంటి గొడవలు జరగ్గపోవడమూ కూడా విశేషమే.




 గర్ల్ ఫ్రెండ్స్‌ను మెయింటేన్ చేయడం కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందన్న భయాందోళనలు మగవాళ్లకు అవసరం లేదు. మగవాళ్లకే గర్ల్ ఫ్రెండ్స్ ఖర్చు పెడతారు. తన బాయ్ ఫ్రెండ్‌కు నెలకు 20 వేల రూపాయలు వస్తాయని, అతన్ని ఎక్కువసార్లు తానే  షికార్లకు తీసుకెళతానని, డబ్బులు తానే ఖర్చు పెడతానని, తన బాయ్ ఫ్రెండ్ పర్సు చూసి అందులో డబ్బులు తక్కువుంటే రెండు, మూడొందల రూపాయలు అతని పర్సులో పెడతానని జియావో కిన్ అనే 23 ఏళ్ల అమ్మాయి తెలియజేసింది. తన బాయ్ ఫ్రెండ్‌కు కూడా ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని, బాయ్ ఫ్రెండ్‌ను మెప్పించేందుకు తామే ఎక్కువ ఖర్చు పెడుతుంటామని ఆమె చెప్పింది. లీ బిన్, జియావో లిన్ అనే యువకులు తమకు ముగ్గురేసి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని గొప్పగా చెప్పకున్నారు. వారిలో ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్‌కాగా, ఒకరు తన లవర్ అని లీ బిన్ తెలిపారు. గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే లవర్ ఒప్పుకుంటారా ? అని ప్రశ్నించగా తమ మధ్య మంచి అండర్‌స్టాండింగ్ ఉందని చెప్పారు.




 తామంతా యవ్వనాన్ని ఇలా ఎంజాయ్ చేస్తామని, పెళ్లీడురాగానే తమ గర్ల్ ఫ్రెండ్స్ వారింటికి వెళ్లి తమకు నచ్చిన వారిని చేసుకుంటారని, వారెంతైనా డీసెంట్ గర్ల్స్ అని జియో లిన్ వ్యాఖ్యానించారు.  సరాసరి 27 ఏళ్ల వయస్సులో నగరంలోని మహిళలు పెళ్లి చేసుకుంటున్నారు. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ఈ సరికొత్త ట్రెండ్‌పై 'చైనా పీపుల్స్ డాట్ కామ్' సర్వే జరిపింది. నగరంలో ఈ కొత్త ట్రెండ్‌కు కారణం మహిళలు ఎక్కువగా ఉండటమేనని తెలిపింది. వంద మంది మహిళలకు 89 మంది మగాళ్లు ఉన్నారు. అందుకు కారణం మహిళలకు మాత్రమే ఉద్యోగాలిస్తామంటున్న కంపెనీలు నగరంలో పెరిగిపోవడమేనట. ఈ నగరం ట్రెండ్‌పై చైనాలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నప్పటికీ ఎలాంటి చట్టాలు లేకపోవడంతో ఏ ట్రెండ్‌ను నియంత్రించలేకపోతున్నామని చైనా ప్రభుత్వం చెబుతోంది. వలస కార్మికులకు మాత్రమే ఈ ట్రెండ్ పరిమితమైందని సమర్థించుకుంటోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top