ఈ లేడీ పోలీస్తో పెట్టుకుంటే అంతే..!

ఈ లేడీ పోలీస్తో పెట్టుకుంటే అంతే..! - Sakshi


స్టాక్హోం: ఆమె ఓ పోలీస్ ఆఫీసర్. డ్యూటీ లేని సమయంలో పార్కులో సేదతీరుతోంది. 'డ్యూటీలో లేదుగా ఆమేం చేస్తుందిలే' అనుకున్నడో లేక తనపై తనకు అతినమ్మకమో గాని ఓ దొంగ తన చేతివాటం చూపించాడు. అంతే.. బికినిలో ఉన్న ఆ పోలీస్ ఆఫీసర్ కొదమసింహంలా దూకింది. దొంగకు గట్టి బుద్ధి చెప్పింది.



వివరాల్లోకి వెళ్తే.. స్వీడిష్ పోలీస్ ఆఫీసర్ మైఖేల్ కెల్నర్ తన ముగ్గురు స్నేహితురాళ్లతో కలిసి ఇటీవల స్టాక్హోంలోని ఓ పార్క్కు వెళ్లింది. అక్కడ బికినిలో సన్బాత్ ఎంజాయ్ చేస్తూ సేదతీరుతోంది. ఆ సమయంలో వారి వద్దకు న్యూస్ పేపర్ అమ్మేవ్యక్తినంటూ ఓ వ్యక్తి వచ్చాడు. అతడు వెళ్లిన తరువాత గమనిస్తే.. కెల్నర్ మిత్రురాలి ఫోన్ మిస్సయింది. దీంతో ఒక్కసారిగా దొంగ వైపు పరిగెత్తిన కెల్నర్ అతడిని పట్టుకొని నేలపై పడేసి అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. బికినిలో ఉండి కూడా డ్యూటీ నిర్వహించిన కెల్నర్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కెల్నర్ మాత్రం.. 'ఆ సమయంలో నేను నగ్నంగా ఉన్నా అదేపని చేసేదాన్ని' అంటూ అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top