బర్త్డే గిఫ్ట్ అదుర్స్...

బర్త్డే గిఫ్ట్ అదుర్స్...


టోక్యో : 


మనం ఎవరైనా పుట్టిన రోజు నాడు జీవిత భాగస్వామి నుంచి సాధారణంగా ఏం కోరుకుంటాం. పుట్టిన రోజు భార్యదైతే భర్త నుంచి నగలు, నట్రా, నచ్చిన దుస్తులు....సాయం సంధ్య వేళ షికారుకి అటు నుంచి నచ్చిన సినిమాకి..మరీ అయితే ఖరీదైన హోటల్‌కి...అదే పుట్టిన రోజు భర్తదైతే సినిమా, షికారు, క్లబ్‌కి లేదా పబ్‌కి, మరీ కాదంటే మిత్రులతో కలిసి ఇంట్లోనే చీర్స్. కానీ జపాన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లో నివసిస్తున్న క్లేర్ పాటర్, జిమ్ గ్రీనన్ దంపతులు మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నారు. 20 ఏళ్లుగా కలిసి జీవిస్తున్న వాళ్లు పెళ్లి చేసుకొని పన్నెండేళ్లైంది. అయితే వారికి 15 ఏళ్ల కొడుకు, 8 ఏళ్ల కూతురు (దత్తత) ఉన్నారు. భర్త జిమ్ గ్రీన్ సాదాసీదా మనిషి, సౌమ్యుడు. సోఫాపై కాలు మీద కాలేసుకొని కాఫీ తాగుతూ కాలక్షేపం చేయడం ఆయనకు చాలా ఇష్టం. ఒక్కమాటలో చెప్పాలంటే జెంటిల్ మేన్. ఇక భార్య క్లేర్ మాత్రం డైనమిక్. ఎప్పుడు బిజీ బిజీ..ఇంట్లో వంటతో సహా అన్ని పనులు తానే చేయడంతోపాటు సైకిల్‌పై మార్కెట్‌కి వెళ్లి ఇంటిల్లిపాదికి అవసరమైన సరుకులు తీసుకరావడానికి తెగ ఆరాటపడేది..రోజువారి దినచర్యలతోపాటు, వారం, నెల, సంవత్సరం చేయాల్సిన పనుల జాబితాలను తయారు చేయడం ఆమెకి అలవాటు. కాసింత సమయం చిక్కితే నవలలు కూడా రాస్తారు. ఈ జనవరి రెండో తేదీన జిమ్ 50వ పుట్టినరోజు వచ్చింది. ఈ ఏడాదంతా భర్త చేయాల్సిన లేదా పాటించాల్సిన యాభై షరతులను రంగు రంగుల చీటీలపై రాసి వాటిని ఓ బాక్స్‌లో పెట్టి జిమ్‌కు పుట్టినరోజు కానుకగా భార్య క్లేర్ ఇచ్చేసింది. ఈ చీటిల గిఫ్టు గురించి ఆ నోటా ఈ నోటా పాకి చివరకు మీడియాకు తెలియడంతో ఆ దంపతులు కాస్త పెద్ద సెలబ్రిటిలయ్యారు. ఇప్పుడు రేడియో టాక్ షోలతో బిజీ బిజీ....

 క్లేరి పాటర్ చీటీల ద్వారా భర్తకు పెట్టిన ముచ్చటైన షరతుల్లో కొన్ని......




1. పుట్టినరోజు కోసం మీరే పాటరాసి ఆ రోజు అందుకు అనుగుణంగా డాన్స్ చేయాలి.

2. పొద్దున్నే నిద్రలేచి స్నానం చేసి దాంతో కలిగే అనుభూతిని ఆస్వాదించాలి.

3. నిద్ర లేవగానే కొడుకును దగ్గరకు తీసుకొని ఆరు సెకన్లపాటు హత్తుకోవాలి.

4. కొడుకు పేరిట ఉత్తరం రాసి పోస్టు చేయాలి.

5. దత్తత తీసుకున్న కూతురు దగ్గరకెళ్లి కాసేపు కాలక్షేపం చేయాలి.

6. స్వయంగా బ్రెడ్‌ను బేక్ చేయాలి.

7. కనీసం వారం పాటు నచ్చిన బొమ్మలు గీయాలి.

8. హృదయాన్ని గీయడం మాత్రం మరిచిపోవద్దు.

9. ఇంట్లో నచ్చిన ప్రదేశాలను అందంగా ఫొటోలు తీయాలి.

10. టాయ్‌లెట్‌ను పూలతో అందంగా అలంకరించాలి.

11. ఏదో పుస్తకం మొదటి పేరా చదవి అది ఇచ్చిన ప్రేరణతో ఏదో ఒక పని చేయాలి.

12. మార్కెట్‌కెళ్లి పక్షులు తినే ఆహారాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు గార్డెన్‌లో పక్షులకు అందుబాటులో ఉంచాలి.

13. ఓ పండ్ల గింజను తెచ్చి నాటి, అది పెరిగాక దాని ఫలం తినాలి.

14. బయటకు వెళ్లి పగలబడి నవ్వుతూ యోగా చేయాలి.

15. డాన్స్ క్లాసులకు వెళ్లాలి.

16. సెలవుల్లో ముక్కుమొహం తెలియని వారిని కలుసుకొని కబుర్లు చెప్పాలి.

17. చారిటీ షాపుకు వెళ్లి నచ్చిన డ్రెస్ కొనుక్కోవాలి.

18. మాజీ ఇంటి యజమాని చనిపోయిన రోజున ఆయన సమాధి వద్దకు వెళ్లి నివాళి అర్పించాలి.

19. వారాంతంలో స్నేహితులను తీసుకొచ్చి వారికి తేనీటి విందు ఇవ్వాలి.

20. ప్రముఖ గ్రంథాలయానికెళ్లి నచ్చిన పుస్తకంలో ఐదు డాలర్ల నోటు పెట్టాలి. ఆ నోటు ఎవరికి కనిపిస్తే వారికే చెందుతుందని నోటు కూడా పెట్టాలి.

21. సీసాలో సందేశం పంపాలి( ది మెసేజ్ ఇన్ ద బాటిల్, హాలీవుడ్ సినిమా స్ఫూర్తి కావచ్చు).

22. ఏడాది చివరలో నేను పెట్టిన యాభై షరతులపై నాకో ప్రేమ లేఖ రాయాలి.

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top