షార్క్ కు పంచ్ పవర్ రుచి చూపించాడు..

షార్క్ కు పంచ్ పవర్ రుచి చూపించాడు..


సిడ్నీ: సర్ఫింగ్ చేస్తుండగా తనపై దాడికి యత్నించిన షార్క్ పై ఆస్ట్రేలియా సర్ఫర్ తన చేతి పంచులు రుచి చూపించాడు. ఇటువంటి అరుదైన సంఘటన ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్లో జరిగింది. అయితే షార్క్ దాడిలో గాయాలపాలైన క్రేయిగ్ ఐసన్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అధికారులు వివరాల ప్రకారం.. ఈ రోజు ఉదయం ఐసన్ సహా మరోవ్యక్తి 100 మీటర్ల సర్ఫింగ్ చేస్తున్నారు. అయితే అనుకోకుండా వారికి ఓ షార్క్ కనిపించింది. అది వారిపై దాడికి యత్నించిందని పోలీసులు తెలిపారు. వెంటనే ప్రతిగా స్పందించిన ఐసన్ షార్క్ బారినుంచి తప్పించుకోవడానికి దానిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. షార్క్ తన తోకతో ఇబ్బందులకు గురిచేయాలని చూడగా ఐసన్ దానిపై తన పంచ్ పవర్ చూపించి ఎలాగోలాగ తప్పించుకున్నాడు.



ఈ ప్రయత్నంలో ఐసన్ చేతికి, కాలికి గాయాలయ్యాయని అధికారులు వివరించారు. సర్జరీ చేయించాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపినట్లు పేర్కొన్నారు.  ఈ నెలలో షార్క్ దాడి జరగడం ఇది మూడోసారి అని, ఈ ఘటన తర్వాత 24 గంటలపాటు చుట్టుపక్కల ఉన్న అన్ని బీచ్ లను మూసివేయనున్నట్లు హిల్ తెలిపారు. ఆస్ట్రేలియా సర్ఫింగ్ చాంపియన్ మిక్ ఫాన్నింగ్  దక్షిణాఫ్రికాలోని ఓ బీచ్ లో తనపై దాడికి యత్నించిన షార్క్పై పంచులు విసిరిన వారం రోజుల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top