Alexa
YSR
‘ఆర్థిక అసమానతలు తొలగకపోతే రాజకీయ స్వాతంత్య్రానికి అర్థం లేదు’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం అంతర్జాతీయంకథ

సముద్రంలోకి ఏనుగు.. సైన్యం అద్భుతం

Others | Updated: July 13, 2017 15:32 (IST)
సముద్రంలోకి ఏనుగు.. సైన్యం అద్భుతం
కొలంబో: శ్రీలంక నావికా దళ సిబ్బంది అద్భుత సాహసం చేశారు. నడిసంద్రంలో మునిగిపోతున్న ఏనుగును పెద్ద మొత్తంలో శ్రమకూర్చి రక్షించారు. దాదాపు పన్నెండు గంటలు దానిని బయటకు తీసేందుకు శ్రమకూర్చారు. ఈస్ట్రన్‌ నావల్‌ కమాండ్‌కు చెందిన నావికా సిబ్బంది రోజు వారి చర్యలో భాగంగా హిందూ మహాసముద్రంలోని తమ తీర రేఖ వెంబడి గస్తీకి వెళుతుండగా కోకిలాయ్‌లోని కొక్కుతుడువాయ్‌ అనే ప్రాంతంలో ఒక పెద్ద అల ఓ ఏనుగును నడిసంద్రంలోకి ఎత్తుకెళుతుండటం గమనించారు. సేద తీరేందుకు వచ్చిన అల్లియా పుల్మోద్దాయ్‌ అనే ఏనుగు సముద్రంలోకి దిగింది.

అదే సమయంలో భారీ అల వచ్చి ఈడ్చుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో అటుగా వచ్చిన నేవి సిబ్బంది దీనిని గమనించి శీఘ్రంగా స్పందించి అత్యవసర విభాగానికి చెందిన సిబ్బందిని అప్రమత్తం చేశారు. వెంటనే ప్రత్యేక స్మిమ్మింగ్‌ సూట్‌లు ధరించి సముద్రంలోకి దిగిన వారు ఏనుగు మెడకు, నడుము భాగానికి తాడును తగిలించి తమ నౌక సహాయంతో ఒడ్డుకు చేర్చి అటవీశాఖ సిబ్బందికి అప్పగించారు. సైన్యం చేసిన ఈ పనికి పలువురు ప్రశంసలు గుప్పిస్తున్నారు. 

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

టెట్..ఓకే

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC