జేబులో పట్టే వాషింగ్ మిషన్
బీజింగ్: ప్రపంచంలోనే అతిచిన్న వాషింగ్ మిషన్‌ను చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వస్తువుల తయారీ సంస్థ ‘హేర్’ రూపొందించింది. ఎలక్ట్రిక్ షేవర్ పరిమాణంలో ఉండే దీనిని ‘కొడో’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. దీన్ని మీతోపాటే ఆఫీస్‌కి, ప్రయాణాల్లో వెంట తీసుకెళ్లొచ్చు. జేబులో, ల్యాప్‌టాప్ బ్యాగ్‌లో సులభంగా పట్టేస్తుంది. 50 నుంచి 120 సెకన్లలో ఎలాంటి మరకనైనా ఈ వాషింగ్ మిషన్ తొలగిస్తుంది.