చోరీ చేయబోయి..యువతికి దొరికాడు అంతే..

చోరీ చేయబోయి..యువతికి దొరికాడు అంతే.. - Sakshi


బస్సులో పర్సు చోరీ చేయాలనుకున్న దొంగకి చుక్కలు చూపించింది ఓ యువతి. ఈ సంఘటన చైనాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రద్దీగా ఉన్న బస్సులో ఓ యువతి తన ఫోన్తో బిజిగా ఉంది. అదే సరైన సమయంగా బావించి హ్యాండ్ బ్యాగ్ లక్ష్యంగా చేసుకొని ఓ దొంగ చోరీ చేయడానికి ప్రయత్నించాడు.



కానీ, అంతలోనే బస్సు స్టాప్ రావడంతో కొందరు ప్రయాణికులు దిగిపోయారు. అయినా ఆ దొంగ తన ప్రయత్నాలను విరమించుకోలేదు. సరిగ్గా హ్యాండ్ బ్యాగ్ లో చేయి పెట్టే సమయంలోనే యువతి గమనించి అందిరిని పిలవడానికి ప్రయత్నించింది. అంతలోనే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న దొంగపై తన కరాటే స్కిల్స్ చూపించింది ఆ యువతి. సెకన్లలోనే అతన్ని కుప్పకూలేలా చేసింది. గట్టిగా ఒక్క తన్ను తంతే వెళ్లి బస్సు సీట్లో పడ్డాడు. అమ్మాయే కదా ఏం చేస్తుందిలే అని వారినే టార్గెట్ చేసే దొంగలకు ఈ వీడియో చూపించాలంటూ..సోషల్ మీడియాలో కామెంట్లమీద కామెంట్లు వస్తున్నాయి.



 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top