ఐసీయూలో అమ్మానాన్నలకు.. వెంటనే కూతురికి పెళ్లి

ఐసీయూలో అమ్మానాన్నలకు.. వెంటనే కూతురికి పెళ్లి - Sakshi

చికాగో :  అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన జుబల్ కిర్బీ (49)  నయంకాని  జబ్బుతో మూడు వారాలుగా ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నాడు. అతని ఆరోగ్యం  దాదాపుగా మెరుగుపడే అవకాశాలు లేవని వైద్యులు ధృవీకరించారు.  ఇంతటి విషాదకర  సమయంలోనూ  అతడి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. నీళ్లు నిండిన కళ్లతోనే తన జీవితంలో అతి ముఖ్యమైన రెండు సంతోషకర ఘట్టాలను తన గుండెల్లో పదిలపర్చుకున్నాడు.  సుదీర్ఘం కాలంగా   సహజీనం చేస్తున్న కొలీన్ ను జుబల్ పెళ్లాడటం ఒకటయితే, మరొకటి  అతని గారాల  కూతురు  కైలా వివాహ వేడుక. 

 

 వేడుకలు వివరాల్లోకి వెడితే  జుబల్ తీవ్రమైన శ్వాసకోశ (పల్మనరీ ఫైబ్రోసిస్) వ్యాధితో బాధపడుతున్నాడు. రోజురోజుకి మృత్యువుకు చేరువవుతున్నాడు. ఈ సమయంలో గత సోమవారం  కొల్లీన్ కిర్బీని చట్టబద్ధంగా తన భార్యను చేసుకున్నాడు. 26 సంవత్సరాలుగా సహజీవనం సాగిస్తున్న వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం కోసం ఎదురు చూసే టైం లేదు. అందుకే ఇదే సరైన సమయమని భావించారు. అంతే కూతుళ్లు కూడా  లేకుండానే  ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నే వేదికగా  ఎంచుకున్నారు.



కూతురు కైలా (20) కు  వచ్చే సంవత్సరం జూలై 16న  పెళ్లి చేయాలని ముహూర్తం నిర్ణయించారు. కానీ జుబల్ పరిస్థితి క్షీణిస్తూ వుండడంతో  కైలా తన నిర్ణయం మార్చుకుంది. అత్యవసరంగా పెళ్లి చేసుకోవాలనుకుంది. తండ్రి సమక్షంలోనే జుబల్ చికిత్స పొందుతున్న ఇంటెన్సివ్ కేర్ రూమ్‌లోనే తమ పెళ్లి జరగాలని కోరుకుంది.   హాస్పిటల్ లోని డాక్టర్లు, నర్సులు, జర్నలిస్టులే  అతిధులు కాగా జుబల్   ఆనందబాష్పాల్ని  చూస్తూ కైలా కిర్బీ, డానియల్ పార్దూ  ఒక్కటయ్యారు.  పెళ్లి వేడుకను  చూస్తున్న జుబల్ ఆక్సిజన్ మాస్క్‌ తీసేసి కన్నకూతురును ఆప్యాయంగా ముద్దాడాడు.  దీంతో అక్కడంతా గంభీర వాతావరణం నెలకొంది. 



 

దాదాపు 50 మంది హాజరైన  ఆ వేడుకకు ఆసుపత్రి సిబ్బంది కేక్ లు, పూలతో సహా అన్ని ఏర్పాటు చేశారు.  నాకు సంతోషంగా ఉంది.. కానీ...నాన్న నా పక్కన  నిలబడాలనుకున్నా.. ఎందుకంటే తనే నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ కన్నీళ్లు తుడుచుకుంది  నవవధువు కైలా.

తను కోరుకున్నట్టుగా, అనుకున్నట్టుగానే అన్నీ ఇవ్వలేకపోయినా...కనీసం తండ్రి కళ్లముందు  పెళ్లి జరగాలన్న  కైలా కోరికను తీర్చగలిగానంటూ  ఆమె బంధువు చెప్పారు.

 

 

 


 
Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top