తాత శవంతో సెల్ఫీ..

తాత శవంతో సెల్ఫీ.. - Sakshi


లండన్: సెల్ఫీల పిచ్చి ముదురుతోంది. సెల్ఫీలపై మోజుతో కొందరు ప్రమాదకర సాహసాలు చేస్తూ ప్రాణాలు కోల్పోతుండగా, మరి కొందరు విషాదకర సందర్భాల్లోనూ సెల్ఫీలు దిగుతూ జుగుప్స కలిగిస్తున్నారు. సౌదీ అరేబియాకు చెందిన ఓ యువకుడు మరణించిన తాత పక్కన సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.



 మంచంపై తాత మృతదేహం పక్కన విచిత్రమైన హావభావాలతో మొహం పెట్టి, నాలుకను బయటకు చాచి సెల్ఫీ దిగాడు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పక్కన 'గుడ్ బై గ్రాండ్ ఫాదర్' అంటూ రాసుకున్నాడు.  చావుకు, శుభాలకు తేడా తెలియని ఈ ఫొటో చూసి నెటిజెన్లు షాక్ అయ్యారు. కుర్రాడి ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదులు రావడంతో ఈ సంఘటనపై సౌదీఅధికారులు విచారణకు ఆదేశించారు. సెల్ఫీ దిగిన కుర్రాడిది కనీస బాధ్యతారహితమని, నైతిక విలువలను ఉల్లంఘించడమేనని మదీన ప్రాంత మీడియా, ప్రజాసంబంధాల అధికారి అబ్దుల్ రజాక్ అన్నారు. ఈ ఘటన నేరమని, ఆ కుర్రాడిని శిక్షించాలని సౌద్ అల్ హర్బీ అనే న్యాయవాది అన్నారు.

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top