'బీడుబడిన భూముల్లో జలయజ్ఞంతో ఆనందపు సిరులు పండాలి'
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం అంతర్జాతీయంకథ

ఆ యంగ్ సింగర్ కు పదికోట్ల ఫాలోవర్స్..!

PTI | Updated: September 28, 2016 16:51 (IST)
ఆ యంగ్ సింగర్ కు పదికోట్ల ఫాలోవర్స్..!

లాస్ ఏంజెలెస్ః అమెరికన్ పాప్ సింగర్ సెలెనా గోమెజ్ కు ఇమేజ్ షేరింగ్ సైట్ ఇన్ స్టా గ్రామ్ లో అశేష ఆదరణ లభించింది. పదికోట్ల మంది ఫాలోవర్లున్న మొదటి మహిళగా రికార్డును తెచ్చిపెట్టింది.  సైట్ లో  91.4 మిలియన్ల ఫ్యాన్స్ తో ఇప్పటివరకూ ముందు స్థానంలో ఉన్న ఆమె స్నేహితుడు టేలర్ స్విఫ్ట్ ను బీట్ చేసి ఇన్ స్టా గ్రామ్ లో మోస్ట్ ఫాలోడ్ పెర్సన్ గా 'గోమెజ్' రికార్డ్ బ్రేక్ చేసిందని  బ్రిటన్ కు చెందిన ఓ వెబ్ సైట్ నివేదికల్లో వెల్లడించింది.

తన పాటలతో అనేకమంది హృదయాలను కొల్లగొట్టిన 24 ఏళ్ళ సెలెనా అత్యధిక ఫాలోవర్లున్న సెలబ్రిటీగా రికార్డు సృష్టించింది. నిజానికి గత ఆరు వారాలుగా సైట్ కు దూరంగా ఉంది. అయినప్పటికీ ఆమెకు అభిమానుల పరంపర కొనసాగుతూనే ఉండటం ఆమెనే ఆశ్చర్యంలో ముంచెత్తింది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గోమెజ్.. గతంలోనూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోకు అత్యంత గుర్తింపు లభించింది.  స్ట్రాతో కోకో కోలా తాగుతున్న ఫోటోను షేర్ చేసి, 4 మిలియన్ల లైక్ లు సంపాదించి ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది. దీంతో గోమేజ్ కు ఫోటో షేరింగ్ సైట్ లో విజయాన్ని పొందడం కొత్తేమీ కాదనిపిస్తుంది.

ఇన్ స్టా గ్రామ్ లో ఇప్పటివరకూ 91.4 మిలియన్ల మంది అభిమానులతో మొదటి స్థానంలో టేలర్ స్విఫ్ట్,  85.3 మిలియన్ల మంది అభిమానులతో బెయోన్సు, 83.6 మిలియన్ల మంది అభిమానులతో కిమ్ కర్దాషియాన్ లు  ఉండగా.. 100 మిలియన్ల మంది అభిమానులతో తాజా రికార్డు సంపాదించిన  గోమేజ్ ఇన్ స్టా గ్రామ్ క్వీన్ గా పాపులారిటీ సంపాదించింది.

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

ముస్లింలకు 12% రిజర్వేషన్లు

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC