కొండచిలువ కరవరాని చోట కరిచింది!

కొండచిలువ కరవరాని చోట కరిచింది! - Sakshi


బ్యాంకాక్: థాయ్లాండ్లో ఓ వ్యక్తికి ఊహించని సంఘటన ఎదురైంది. ఇంటిలోని టాయ్లెట్ రూం అతనికి పీడకలను మిగిల్చింది. కరువరాని చోట కొండచిలువ కరవడంతో హాస్పిటల్ బెడ్పై అతగాడు మీడియా చానెళ్లకు నవ్వుతూ ఇంటర్వూలు ఇస్తున్నాడు.



వివరాల్లోకి వెళ్తే.. అత్తాపోర్న్ బూన్మక్చోయ్ అనే వ్యక్తి టాయ్లెట్కు వెళ్లగా టాయ్లెట్ బౌల్ వెనకాల దాక్కున్న ఓ 10 అడుగుల కొండచిలువ దాడిచేసింది. ఈ ఘటనలో అతని ప్రైవేట్ పార్ట్లో కొండచిలువ కరిచి సుమారు అరగంట పాటు అతనికి నరకయాతన మిగిల్చింది. కేకలు వేస్తున్న అతడిని గమనించి భార్య వచ్చి కొండచిలువకు తాడుకట్టి లాగితే గాని అది వదిలిపెట్టలేదు. సమాచారం అందుకున్న అత్యవసర సేవల విభాగం వారు అత్తాపోర్న్ను అసుపత్రికి తరలించి  కొండచిలువను సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని, ప్రమాదమేమీ లేదని డాక్టర్లు వెల్లడించారు. అంతేకాదు ఇంత విపత్కర పరిస్థితుల్లో సైతం బెడ్పై నవ్వుతూ థాయ్ మీడియాకు ఇంటర్వూలు ఇస్తున్న అతగాడి మంచి మనసును కొనియాడుతున్నారు డాక్టర్లు.

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top