విమానం నడిపేటప్పుడు పైలట్లు పడుకుంటారట!

విమానం నడిపేటప్పుడు పైలట్లు పడుకుంటారట!


కాలిఫోర్నియా: మనం విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు మన ప్రాణాలు ఆ భగవంతుడి చేతుల్లో ఉంటాయని అనుకుంటాం. కానీ పెలైట్లు నిద్రపోయారా, లేదా? అన్న అంశంపై ఆధారపడి ఉంటాయని మనకు తెలియదు. కాక్‌పీట్ లాక్ చేసుకుంటారు కనుక లోపల ఏం జరుగుతుందో మనకు కనిపించదు. ఎలాంటి అంతరాయం లేకుండా ఏకాగ్రతతో విమానం నడిపేందుకే వారలా కాక్‌పిట్ లాక్ చేసుకుంటారని భావిస్తాం. వాస్తవానికి చాలా మంది పెలైట్లు కునుకు తీస్తారట. కొందరైతే విమానాన్ని ఆటోమోడ్‌లోకి మార్చి ఏకంగా గురకపెడతారట.


 ఇవి ఎవరో అక్కసుతో చెప్పిన మాటలు కాదు సుమా! స్వయంగా పెలైట్లు తమంతట తాముగా వెల్లడించిన విషయాలు. ఇవి పెలైట్లు అధికారుల ముందు అంగీకరించిన విషయాలు కావు. చర్చిలోకెళ్లి పశ్చాత్తాప పడినట్లుగానే ఆ పెలైట్లు ‘విస్పర్ యాప్’లో తమ గురించి తాము చెప్పుకున్నారు. గుర్తింపు చెప్పుకోవాల్సిన అవసరం లేదుకనకనే వారు కన్ఫెషన్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ యాప్‌ను ఆశ్రయించారు. వారు చెప్పిన విషయాలు వారి మాటల్లోనే......


 ‘నేనో పెలైట్‌ని. టోక్యో నుంచి గమ్యానికి వెళుతున్నాను. నేను, నా కెప్టెన్ 15 నిమిషాల పాటు నిద్రపోయాను.....నేను ప్రధాన విమానయాన సంస్థలో కోపెలైట్‌గా పని చేస్తున్నాను. కాసేపు కునుకుతీసి లేచేసరికల్లా నా పక్కన పెలైట్ కూడా నిద్రపోతున్నారు.....నేను పెలైట్‌ని. మార్గమధ్యంలో నేను ఒక్కసారి కూడా నిద్రపోకుండా విమానాన్ని ఇంతవరకు ఒక్కసారి కూడా నడపలేదు.....నేను పెలైట్‌ని. ప్రయాణికులను భయపెట్టడమంటే సరదా. ఉద్దేశపూర్వకంగానే ఫ్లాష్ లైట్లను వేసి, అలారం మోగించి ప్రయాణికులను భయపెట్టిన సందర్భాలు ఉన్నాయి....నాకు ఎక్కువ ఎత్తులో ప్రయాణించడమంటే భయం. ఎత్తై భవనాన్ని ఢీకొట్టినట్టు అనిపిస్తుంది.....విమానం ఎగిరేటప్పుడు, దిగేటప్పుడు సెల్‌ఫోన్లను ఎరోప్లేన్ మోడ్‌లోకి తప్పనిసరిగా మార్చుకోవాల్సిందిగా ప్రయాణికులను హెచ్చరిస్తాం. కానీ పెలైటైన నేను ఎన్నడూ నా మొబైల్‌ను ఎరోప్లేన్ మోడ్‌లోకి మార్చ లేదు’ అంటూ మరొకరు  కాక్‌పిట్ కన్ఫెషన్లు వినిపించారు.


Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top