ఎయిర్‌ షోలో ప్రమాదం.. పైలట్‌ మృతి


బీజింగ్‌: వాయువ్య చైనాలోని గాన్సు ప్రాంగణంలో శనివారం జరిగిన వైమానిక ప్రదర్శనలో అపశ్రుతి చోటుచేసుకుంది. వైమానిక ప్రదర్శనలో భాగంగా గగన విన్యాసంలో చక్కర్లు కొడుతున్న విమానం కాస్తా ఒక్కసారిగా నేలపైకి దూసుకొచ్చి అంతర్జాతీయ జనరల్‌ ఏవియేషన్ కన్వెన్షన్ నగర ప్రాంతంలో కుప్పకూలింది.



ఈ ఘటనలో విమాన పైలట్‌ మృతిచెందినట్టు అక్కడి స్థానిక మీడియా నివేదించింది. అయితే ఈ విమాన ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఓ నివేదిక వెల్లడించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top