133 మంది విద్యార్థుల మృతి

133 మంది విద్యార్థుల మృతి


పాకిస్థాన్ ఉగ్రవాద దాడిలో దాదాపు 133 మంది విద్యార్థులు మరణించినట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. మరో 200 మంది వరకు గాయాల పాలయ్యారు. పెషావర్లోని ఆర్మీ పాఠశాలలో జరిగిన ఈ దాడిలో వంద మంది మరణించినట్లు ఖైబర్ ఫక్తుంఖ్వా రాష్ట్ర ముఖ్యమంత్రి వెల్లడించారు. తొలుత కేవలం 23 మంది మాత్రమే మరణించినట్లు భావించినా, లోపలున్న ఉగ్రవాదులపై సైనికులు కాల్పులు జరిపి, ముగ్గురిని హతమార్చడంతో ఉగ్రవాదులు మరింతగా రెచ్చిపోయారు.



మొత్తం 133 మంది విద్యార్థులు,  9 మంది టీచర్లు ఈ ఉగ్రదాడిలో మరణించినట్లు జాతీయ మీడియా వర్గాలు కూడా చెబుతున్నాయి. 960 మందిని భద్రతా బలగాలు రక్షించాయి. 9 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ దుర్ఘటన విషయం తెలియగానే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ హుటాహుటిన పెషావర్ బయల్దేరారు. కాగా, భారీ సంఖ్యలో గాయపడిన విద్యార్థులు, ఉపాధ్యాయులు వస్తుండటంతో పెషావర్లోని ఆస్పత్రిలో రక్తానికి తీవ్ర కొరత ఏర్పడింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top