మసాజులు, సెక్స్‌ పార్టీల కోసం ప్లెజర్‌ స్క్వాడ్స్‌!

మసాజులు, సెక్స్‌ పార్టీల కోసం ప్లెజర్‌ స్క్వాడ్స్‌! - Sakshi

  • ఉత్తరకొరియాలో అనాచారాన్ని పునరుద్ధరించిన కిమ్‌జాంగ్‌



  • ప్యాంగ్‌యాంగ్‌: ఉత్తరకొరియా నియంత కిమ్‌జాంగ్‌ ఉన్‌ తన తాత కిమి ఇల్‌ సంగ్‌ కాలం నుంచి వస్తున్న అనాచారాన్ని ఇటీవల మళ్లీ పునరుద్ధరించారు. తన కామకేళీ విలాసాల కోసం టీనేజ్‌ బాలికలతో 'ప్లెజర్‌ స్క్వాడ్స్‌'ను ఏర్పాటు చేశారు. వాటిలో పట్టుమని 13 ఏళ్ల ప్రాయం నిండని బాలికలు కూడా ఉన్నారు. నియంతతోపాటు నియంత ముఖ్య అనుచరులు, ముఖ్య సైనిక నాయకులకు మసాజులు చేయడం, సంగీత నత్య విభావరిలతో వారిని అలరించడం, సెక్స్‌ పార్టీలలో వారి ముచ్చటను తీర్చడం ఈ 'ప్లెజర్‌ స్క్వాడ్స్‌' నిర్వహించాల్సిన ప్రత్యేక విధులు. ఈ స్క్వాడ్స్‌ను కొరియా భాషలో ‘గిప్పియమ్‌జో’ అని పిలుస్తారు.



    ప్లెజర్‌ స్క్వాడ్స్‌ కోసం సాధారణంగా పాఠశాలల నుంచి దాదాపు రెండు వేల మంది టీనేజీ బాలికలను ఎంపిక చేస్తారు. వారంతా అందంగా ఉండాలి. ఎవరి ముఖాలపై ఎలాంటి మచ్చలుగానీ ఎలాంటి లోపాలుగాని ఉండరాదు. అన్నింటికన్నా ముఖ్యం వారంతా శీలవతులై ఉండాలి. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండరాదు. వంశపారంపర్యంగా జన్యుపరమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయా ? అన్న అంశాన్ని కూడా వివిధ ఆరోగ్య పరీక్షల ద్వారా తనిఖీ చేసి రెండు వేల మందిని ఎంపిక చేస్తారు.



    ఆ రెండు వేల మంది బాలికలను మూడు స్క్వాడ్స్‌గా విభజిస్తారు. ఒక స్క్వాడ్‌ను మసాజ్‌ కోసమే ఎంపిక చేసి వారిని ఆరు నెలల పాటు హాంకాంగ్‌కు మసాజ్‌ శిక్షణ కోసం పంపిస్తారు. మరో స్క్వాడ్‌ను సెక్స్‌ అవసరాలు తీర్చేందుకు ఎంపిక చేస్తారు. మూడో స్క్వాడ్‌ను సంగీత, నత్యంలో తర్ఫీదు ఇవ్వడానికి ఎంపిక చేస్తారు. దేశంలో అధికార చక్రం తిప్పే అతికొద్ది మందికి మాత్రమే ఈ ప్లెజర్‌ స్క్వాడ్స్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. వీరిని ఎంపిక చేసినప్పుడు ప్రభుత్వ ప్రాజెక్టులపై తీసుకెళుతున్నామని మాత్రమే తల్లిదండ్రులకు చెబుతారు. ఆ తర్వాత జీవితంలో వారిని కలువనీయరు. స్క్వాడ్‌కు ఎంపికైన అమ్మాయిలు జీవితంలో ఎన్నడూ కూడా తమ తల్లిదండ్రులతోగానీ, బంధు మిత్రులతోగానీ కనీసం మాట్లాడడానికి వీల్లేదు. వ్యక్తిగత స్వేచ్ఛ అసలు ఉండదు. సెక్స్‌ సేవలు అందించే స్క్వాడ్‌ మిన హా మిగతా రెండు స్క్వాడ్స్‌కు శీల పరీక్షలు తరచుగా నిర్వహిస్తుంటారు.



    వారి ఎంపిక ప్రక్రియ అంతా సైన్యమే చూసుకుంటుంది. వారిలో ఒక్కొక్కరికి నెలకు నాలుగు వేల డాలర్లను వేతనంగా చెల్లిస్తారు. ఈ స్క్వాడ్స్‌ నుంచి పారిపోయి బయటికొచ్చిన వారి వల్ల కిమ్‌ జాంగ్‌ ఉన్‌ తాత కిమ్‌ ఇల్‌ సంగ్‌ కాలం నుంచి ఈ అనాచారం ఆచరణలో ఉందనే విషయం ప్రపంచం దష్టికి వచ్చింది. ఆ తర్వాత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ తండ్రి కిమ్‌ జాంగ్‌ ఇల్‌ హయాంలో కూడా ఈ ప్లెజర్‌ స్క్వాడ్స్‌ను కొనసాగించారు. ఆయన 2011లో చనిపోయినప్పుడు ఆయన పేరిట్‌ కిమ్‌ జాంగ్‌ ఉన్‌ దేశంలో మూడేళ్లపాటు సంతాప దినాలను ప్రకటించారు. అందులో భాగంగా ఈ ప్లెజర్‌ స్క్వాడ్స్‌ను రద్దు చేశారు. తాతల కాలం నుంచి వస్తున్న అనాచారానికి స్వస్తి చెప్పినట్లు అప్పుడు గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు వాటిని మళ్లీ పునరుద్ధరించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top