మంత్రిపై సెక్స్ బొమ్మతో మహిళ దాడి

మంత్రిపై సెక్స్ బొమ్మతో మహిళ దాడి - Sakshi


ద ట్రాన్స్-పసిఫిక్ పార్ట్‌నర్షిప్ అగ్రిమెంట్(టీపీపీఏ)ను వ్యతిరేకిస్తూ ఓ మహిళ న్యూజిలాండ్ ఆర్థికమంత్రి స్టీవ్ జాయ్ పైకి సెక్స్ బొమ్మతో దాడి చేసింది. తమ సార్వ భౌమత్వాన్ని కూనీ చేయడానికే టీపీపీఏ తీసుకువచ్చారని సెక్స్ బోమ్మ విసిరిన జోసీ బోల్టర్ తెలిపారు. న్యూజిలాండ్‌లో ప్రజల స్కేచ్ఛ, హక్కులు కాలరాసేలా ఆ చట్టం ఉందని ఆమె ధ్వజమెత్తారు. నా దేశం కోసమే ఇలా దాడి చేశానని జోసి తెలిపింది. దాడి అనంతర అమెను పోలీసులు అరెస్ట్ చేసి విచారించి, విడుదల చేశారు. అయితే రాజకీయాల్లో ఎప్పుడూ ఎదో కొత్తదనం ఉంటుందని సదరు మంత్రి చమత్కరించి విషయాన్ని అక్కడితో వదిలేశారు.



అంతర్జాతీయంగా ఇంటర్నెట్ స్వేచ్ఛకు ద ట్రాన్స్-పసిఫిక్ పార్ట్‌నర్షిప్ (టీపీపీ) ఒప్పందం తీవ్ర ముప్పుగా ఆందోళనకారులు భావిస్తున్నారు.  40శాతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కవర్ చేయనున్న ఈ ఒప్పందం ఉద్దేశం ఏకీకృత ఆర్థిక బ్లాకును ఏర్పాటుచేయడం. దీని ద్వారా కంపెనీలు, వ్యాపారసంస్థలు తమ వ్యాపారాన్ని సులువుగా నిర్వహించుకోవచ్చు. అయితే ఈ ఒప్పందం ఇంటర్నెట్ ప్రధాన సూత్రాలను నీరుగార్చే అవకాశముందని ఈ డీల్కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యమకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.



కార్పొరేట్ అక్రమాలను 'కంప్యూటర్ సిస్టం' ద్వారా వెలుగులోకి తేవడం నేరమవుతుందని ఈ ఒప్పందంలో ఉన్న ఓ వివాదాస్పద నిబంధనపై ప్రధానంగా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నిబంధనలోని పదజాలం అస్పష్టంగా ఉందని, దీనివల్ల విజిల్ బ్లోయర్లు ఏదైనా సమాచారం ఆన్లైన్ ద్వారా వెల్లడిచేస్తే.. అందుకు జరిమానా గురయ్యే అవకాశం ఉందని, అంతేకాకుండా పాత్రికేయులు కూడా ఈ సమాచారాన్ని ప్రచురించడానికి ముందుకురాకపోవచ్చునని నిపుణులు అంటున్నారు. ఈ ఒప్పందం ప్రకారం అమెరికాలో మాదిరి ఒక చిన్న ఫిర్యాదు వచ్చినా ఆ సమాచారాన్ని యూట్యూబ్, ఫేస్బుక్ వంటి ఆన్లైన్ కంటెంట్ ప్రొవైడర్స్ తొలగించాల్సి ఉంటుంది.

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top