నేపాల్ భూకంప మృతుల సంఖ్య 10వేలు!

నేపాల్ భూకంప మృతుల సంఖ్య 10వేలు! - Sakshi


కఠ్మాండు:  నేపాల్ లో భూంకప మృతుల సంఖ్య దాదాపు 10 వేలకు చేరే అవకాశం ఉందని  నేపాల్ ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలా తెలిపారు.  మంగళవారం  ఆయన మీడియాతో మాట్లాడుతూ మృతుల సంఖ్య పదివేలకు చేరొచ్చనే అనుమానాన్ని వ్యక్తం  చేశారు.  యుద్ధప్రాతిపదికన సహాయక చర్యల్ని చేపట్టామని, ప్రజల సంరక్షణ కోసం తాము చేయాల్సిందంతా  చేస్తున్నామని,  దీనినుంచి బయటపడేందుకు తమ ప్రభుత్వం శాయశక్తులా  ప్రయత్నిస్తోందన్నారు. దాదాపు 7వేల మందికి పైగా గాయపడ్డారని, వారికి వైద్యసేవలు అందించడం పెద్ద సవాల్గా మారిందన్నారు.  




ఇప్పటికి వరకు 5 వేలకుపైగా మృతదేహాలను వెలికితీశారు. మృతుల సంఖ్య గంటగంటకు పెరుగుతోంది. దీన్ని 1943  భూకంపం సృష్టించిన విలయం కంటే కూడా  ఘోరమైందిగా ప్రకటించాయి. కాగా వరుస  ప్రకంపనలతో నేపాల్ అతలాకుతలమైందనీ, భూకంపం సంభవించిన ప్రాంతాలలో ప్రజలు నిత్యావసర వస్తువులు దొరకక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ  విపత్తును ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉందన్నారు.  ఆరు బయటే నిద్రిస్తున్న  ప్రజలకు అందించేందుకు మందులు, టెంట్ల అవసరం చాలా ఉందని, ఈ నేపథ్యంలో మరింత విదేశీ  సహాయాన్ని మరింత కావాలని విజ్ఞప్తి చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top