కూలిన భీమ్సేన్ శిఖరం..శిథిలాల కింద 500మంది!

కూలిన భీమ్సేన్ శిఖరం..శిథిలాల కింద 500మంది!


ఖాట్మండ్‌ :  ఖాట్మండ్‌లోని చారిత్రక ధరహరా భీమ్సేన్ శిఖరం కూలిపోయింది. ఈ శిఖరం  కింద సుమారు 500 మంది చిక్కుకున్నట్లు సమాచారం. వారిని వెలికి తీసేందుకు సహాయక సిబ్బంది యత్నిస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా 19వ శతాబ్దంలో ఈ శిఖరాన్ని నిర్మించారు. భూకంపం అనంతరం ఆ శిఖరం కూలి... శిథిలాలు మాత్రమే మిగిలాయి. అంచనాలకు అందనంతగా నష్టం వాటిల్లినట్లు సమాచారం. భారీగా ప్రాణా, ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోందిజ





కాగా శనివారం ఉదయం 11.42 గంటలకు నేపాల్లోని లామ్జంగ్లో భూకంపం సంభవించింది.  నేపాల్‌లోని భరత్‌పూర్‌కు 60 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.1గా నమోదు అయ్యింది. మరోవైపు నేపాల్ రాజప్రసాదానికి కూడా పగుళ్లు ఏర్పడ్డాయి.  భూకంప తీవ్రతతో భవనాలు, గృహ సముదాయాలు, పురాతన ఆలయాలు, చారిత్రక కట్టడాలు నేలమట్టం అయ్యాయి. దీంతో నేపాల్ మొత్తం దుమ్ము,ధూళితో నిండిపోయింది. చాలా ప్రాంతాల్లో రహదారులు ధ్వంసం అయ్యాయి. కట్టుబట్టలతో రోడ్లపైకి చేరిన జనాలు ఎక్కడికి వెళ్లాలో తెలియక నిస్సహాయ స్థితిలో ఉన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top