మసీదులో మగాళ్లను.. ఇళ్లల్లో ఆడాళ్లను..

మసీదులో మగాళ్లను.. ఇళ్లల్లో ఆడాళ్లను..


మైదుగురి: పవిత్ర రంజాన్ మాసం.. అందునా ప్రార్థనా సమయం కావడఅక్కడి మసీదులన్నీ కిక్కిరి పోయాయి. పొద్దంతా ఉపవాసం ఉండి ఆకలితో ఇంటికిరాబోతున్న భర్తలు, పిల్లల కోసం ఇళ్లల్లో మహిళలు వంటకు పునుకున్నారు. అంతలోనే భీకరంగా మొదలయ్యాయి.. అత్యాధునిక తుపాకుల చప్పుళ్ళు. చిన్నాపెద్దా తేడాలేదు. తుపాకికి అందినవాళ్లను అందినట్లే అనంతలోకానికి పంపేశారు. అదే సమయంలో ఇంకొద్దిమంది ఇళ్లల్లోకి చొరబడి వంటచేస్తోన్న మహిళలను కాల్చిచంపారు. ఇళ్లను తగలబెట్టారు.



ఇదీ ఈశాన్య నైజీరియా బోర్నో రాష్ట్రంలోని మూడు మారుమూల గ్రామాల్లో బోకోహరాం తీవ్రవాదులు సృష్టించిన నరమేధం. గురువారం రాత్రి చోటుచేసుకున్న ఈ తీవ్రవాద దాడుల్లో 150 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. గత మేలో అధ్యక్షుడిగా మహమ్మద్ బుహారీ పగ్గాలు చేపట్టిన తర్వాత నైజీరియాలో చోటుచేసుకున్న అతిపెద్ద సామూహిక మారణకాండ ఇదే. అత్యాధునిక ఆయుధాలతో మోటారు సైకిళ్లపై వచ్చిన తీవ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రత్యక్షసాక్షులు చెప్పారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top