అమ్మకానికి మార్గరెట్ థాచర్ నివాసం...!

అమ్మకానికి మార్గరెట్ థాచర్ నివాసం...!


బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్  ప్యాలెస్ ను అమ్మకానికి పెట్టారు. ఆరంతస్తుల ఆ అపూర్వ భవనంలో సిబ్బంది క్వార్టర్స్, లూయిస్ ఫైర్ ప్లేస్ లు... ఓ ప్రధానమంత్రికి కావలసిన అన్నిరకాల హంగులూ ఉన్నాయి. దానికి తోడు... నీలి రాతితో మెరసి పోతున్న ఆ సౌధాన్ని.. కొనేవారి కోసం యజమానులు నిరీక్షిస్తున్నారు. మాజీ ప్రధాని చివరిగా నివసించిన ఆ భవనంలోని ప్రత్యేకతలను బట్టి... దాని ఖరీదును ముఫ్ఫై మిలియన్ల యూరోలుగా నిర్ణయించారు.



లండన్ లోని 73 ఛెస్టర్ స్క్వేర్ లో ఉన్న ఆ భవంతిలో అంతకు ముందు కవి మాథ్యూ ఆర్నాల్డ్, నవలా రచయిత మేరీ షెల్లీ, 1930 కంజర్వేటివ్ ప్రధాని స్టాన్లీ బాల్డ్ విన్ నివసించారు. ఇటీవల లగ్జరీ డెవలపర్ లెకాన్ ఫీల్డ్ కొన్ని మిలియన్ పౌండ్లతో పునరుద్ధరించి, మూడేళ్ళ తర్వాత మార్కెట్లో అమ్మకానికి పెట్టారు. ఈ భవంతిలోని ప్రధాన ద్వారాలకు థాచర్ ఇష్టంతో  పొదిగించుకున్న 73 నీలి ఫలకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. హాల్లోని ఫ్లోరింగ్, లాబీలకు కూడ అదేరకం రాయిని వినియోగించారు. ఇటువంటి ప్రత్యేకతలు కొనుగోలుదారులను అమితంగా ఆకట్టుకునేట్టుగా ఉన్నాయి.


ముఖ్యంగా ఈ భవనానికి ఏర్పాటు చేసిన బాంబ్ ప్రూఫ్ తలుపులు ఆ నాయకురాలి జీవితానికి గుర్తులుగా నిలుస్తున్నాయి. థాచర్ 1984 లో బ్రైటన్ హోటల్ బాంబు దాడి నుంచి తప్పించుకున్న తర్వాత బాంబ్ ఫ్రూఫ్ తలుపుల అవసరం మరింత పెరిగింది. అంతేకాదు ఈ ప్యాలెస్ లో ప్రదర్శన శాలలు, మోడరన్ జిమ్, సినిమా హాల్, 500 సీసాలు పట్టే వైన్ సెల్లార్ వంటి మరెన్నో ఆధునిక  హంగులూ ఉన్నాయి. మేడమీది రెండో అంతస్తులో మాస్టర్ సూట్లు, డబుల్ బెడ్ రూమ్, డ్రెస్సింగ్ ఏరియా, మాస్టర్ బాత్ రూమ్ సహా అనేక ప్రత్యేక ఆకర్షణలు కొనుగోలుదారులను ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. అలాగే భవనంలోని మరో ఐదు బెడ్ రూమ్ లు, సిబ్బంది వసతి గృహాలతోపాటు ఇటాలియన్ ఫర్నిచర్, పాలరాతి టేబుల్ రాచరికపు అందాలను ఉట్టిపడేలా చేస్తున్నాయి.



థాచర్ త్రండి ఆల్ ఫ్రెడ్ రాబర్ట్స్ 'గ్రాంథం'  ప్రాంతానికి 1945 నుంచి 1946 వరకు మేయర్ గా పనిచేశారు. దీంతో  ఆమె తన బాల్యాన్ని గ్రాంథం లో గడిపింది. స్థానిక గ్రామర్ స్కూల్లో చదివిన మార్గరెట్... ఆక్స్ ఫర్డ్ సోమర్ విల్లె కాలేజీలో కెమిస్ట్రీ లో పట్టభద్రత పొందింది. అనంతరం ఓ పరిశోధన రసాయన శాస్త్రవేత్తగా పనిచేసి, ఆమెకు 25 ఏళ్ళ వయసున్నపుడు రాజకీయాల్లో అడుగు పెట్టింది.  1951 లో కంజర్వేటివ్ అభ్యర్థిగా ఎంపికై... 1970 లో పార్టీ నాయకురాలిగా ఎదిగింది. తర్వాత మూడు పర్యాయాలు జనరల్ ఎన్నికల్లో గెలిచి మొదటి బ్రిటిష్ ప్రధానమంత్రిగా థాచర్ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top