ఆ ఊర్లో అతనొక్కడే

ఆ ఊర్లో అతనొక్కడే


బీజింగ్(చైనా): కుటుంబ సభ్యులంతా ఓ వారం పాటు ఊరెళ్లిపోయి ఇంట్లో ఒక్కరే ఉండాల్సివస్తే ఎలా ఉంటుంది? ఒకటి రెండు రోజులు బాగానే ఉన్నా ఆ తర్వాత దిగులు మొదలవుతుంది. మరి అలాంటిది... ఊరు మొత్తంలో ఒక్కరే ఉంటే? ఊహించడానికే  భయమేస్తుంది కదా..కానీ చైనాలోని క్సెనాన్షె  గ్రామంలో తొమ్మిదేళ్ల నుంచి లూ షెంగ్జీయా ఒక్కడే జీవిస్తున్నాడు.



తొమ్మిదేళ్ల క్రితం ఆ గ్రామంలో 20కి పైగా కుటుంబాలు నివసించేవి. కరువు వల్ల అందరూ వలసవెళ్లిపోవడంతో 2006 నాటికి లూ, అతని తల్లి, సోదరుడు మాత్రమే మిగిలారు. ఆ తర్వాత ఏడాదిలోపే తల్లి, సోదరుడు మరణించడంతో లూ ఒంటరైపోయాడు. ఊరు వదిలి వెళ్లడం ఇష్టం లేని లూ గ్రామంలోనే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నాడు.



ప్రస్తుతం లూ స్థానిక ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాచ్‌మెన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.  సుదూరంలోని పట్టణానికి వెళ్లి కావల్సిన నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటాడు. పాపం లూ కూడా ఒక్కడే ఆ ఊర్లో ఎంతకాలం అని ఉంటాడు.. అందుకే ఒంటరిగా జీవించడం సమస్యగా లేకపోయినా త్వరలో పట్టణానికి వెళ్లిపోవాలని భావిస్తున్నాడట.

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top