షాట్‌గన్‌ క్లీన్‌చేస్తుండగా.. దారుణం!

షాట్‌గన్‌ క్లీన్‌చేస్తుండగా.. దారుణం!


రోమ్‌: సెంట్రల్ న్యూయార్క్ నగరానికి చెందిన ఓ యువకుడు షాట్‌గన్‌ శుభ్రం చేస్తుండగా.. అది పొరపాటున పేలింది. ఆ తూటా వెళ్లి తన గర్ల్‌ఫ్రెండ్ ఏడు నెలల కొడుకుకు తగలడంతో ఆ శిశువు అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనను కారణమైన హెన్రీ బార్టల్‌ను రోమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. రోమ్‌లోని డొమినిక్‌ స్ట్రీట్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ఈ ఘటన జరిగింది. రోమ్‌లో నివాసముంటున్న బార్టల్‌ తన లీవింగ్‌ రూమ్‌లో షాట్‌గన్‌ను శుభ్రం చేశాడు. ఆ తర్వాత తుపాకీని బుల్లెట్లతో లోడ్‌ చేసి.. తన ఒడిలో పెట్టుకున్నాడు.



ఆ సందర్భంలో అతని గదిలో స్నేహితురాలు సెలెనా హిట్‌, ఆమె ఏడు నెలల కొడుకు నాథానియెల్‌, మరో వ్యక్తి ఉన్నాడు. బార్టల్‌ ఒడిలో ఉన్న 12 గేజ్‌ తుపాకీ అనుకోకుండా పేలింది. ఆ సమయంలో తుపాకీ గురి పిల్లాడి వైపు ఉండటంతో తూటా నేరుగా వెళ్లి నాథానియెల్‌ పైశరీర భాగంలో దిగింది. దీంతో ఆ శిశువు అక్కడే ప్రాణాలు విడిచాడు. దీంతో బార్టల్‌ను అరెస్టు చేసి.. అతనిపై శిశు హత్య కేసును పోలీసులు నమోదు చేశారు. నిందితుడైన హెన్రీ బార్టల్‌ అంతకుముందు రోజు వేటకు వెళ్లివచ్చాడని, తన స్నేహితురాలి ఎదురుగా షాట్‌గన్‌ శుభ్రం చేయడం వల్ల ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top