'అందుకే నిజమైన బార్బీ బొమ్మగా మారిపోయా'


కాలిఫోర్నియా: ఈ ఫోటోల్లో కనిపిస్తున్న ఆమెను చూడండి. బార్బీ బొమ్మగా పిలువబడే అంబర్ గుజ్మన్(28) కండరాల సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. అయితే తన సమస్య తీరనందుకు చాలా సంతోషంగా ఉందని, అవే తనను బార్బీ బొమ్మగా మలిచాయని ఈ కాలిఫోర్నియా భామ పేర్కొంది. అయితే అందరిలా ఆమె ఎక్కువ దూరం నడవలేదు. మనలాగ భోజనం చేయలేదు. అటువంటి విషయాలే తనకు ఈ రూపాన్ని ఇచ్చాయంటూ పలు విషయాలను అంబర్ గుజ్మన్ పంచుకుంది. తనకు 18 ఏళ్లున్నప్పుడు ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయని, ఈ వ్యాధికి ఇప్పటివరకు ట్రీట్మెంట్ రాలేదన్నారు.



అయితే ఈ వ్యాధి ఉండటం తనకు ఎలా కలిసొచ్చిందన్న విషయాలను ఆమె వివరించింది. కండరాలను పీక్కుతినే వ్యాధి ఉన్నప్పటికీ, ఈ లక్షణాలు ఉండటం వల్లే నిజమైన బార్బీ బొమ్మగా మారిపోయానని సంతోషాన్ని వ్యక్తం చేసింది. బొమ్మలను మనం ఎలాగైతే వేరే చోటుకి తీసుకెళ్తామో..  తనను కూడా కుటుంబసభ్యులు అలాగే తీసుకెళ్తారని చెప్పింది. ఈ 29 నుంచి ఆగస్ట్ 1 వరకు వర్జీనియాలో జరుగుతున్న నేషనల్ బార్బీ డాల్ కలెక్టర్స్ కన్వెన్షన్  నేపథ్యంలో ... ఈ బార్బీ బొమ్మ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.





Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top