భార్య వర్ధంతి రోజు ప్రేమ లేఖలు పంచాడు

భార్య వర్ధంతి రోజు ప్రేమ లేఖలు పంచాడు


జీవిత భాగస్వామిని కోల్పోవడం ప్రతిఒక్కరి జీవితంలోనూ అత్యంత బాధాకర సంఘటన. భార్యను కోల్పోయిన హోంగ్ కొన్ని రోజుల పాటు పడక గదికే పరిమితమై పెనువిషాదంలో మునిగిపోయాడు. భార్య తొలి వర్ధంతి సందర్భంగా హోంగ్ ఆమె జ్ఞాపకార్థం.. తమ అన్యోన్య ప్రేమానుబంధాన్ని వివరిస్తూ లేఖలు రాసి ప్రజలకు పంచాడు.



నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్న అనంతరం తాము వివాహం చేసుకున్నామని, 11 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత గతేడాది ఒవేరియన్ క్యాన్సర్ వ్యాధి బారిన పడి తన భార్య క్యాథరైన్ జంగా ఈ లోకాన్ని విడిచిందని హో్ంగ్ తెలిపాడు.  భార్య తొలి వర్ధంతి రోజున తమ అనుబంధాన్ని గురించి 100 ప్రేమలేఖలలో రాసి పంచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు.



తాను రాసిన 100 ప్రేమ లేఖలను ఇటీవలే ప్రారంభించిన వైబ్సైట్లో పొందుపరిచాడు. అమెరికాలోని ఉత్తర కరోలినాలో లేఖల పంపకం కార్యక్రమానికి అతను శ్రీకారం చుట్టాడు. తండ్రి బాధ్యతలో భాగంగా పదేళ్ల కూతురు 70 లేఖలను పంచిపెట్టగా, కుమారుడితో కలిసి హోంగ్ మిగిలిన 30 లేఖలను పంచిపెట్టాడు. భార్యపై అతని ప్రేమను, నిజాయతీని చూసి కొందరు మెచ్చుకోగా, ఇలాంటి పని చేయడంపై మరికొందరు ఆశ్చర్యానికి లోనయ్యారట.




 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top